Leading News Portal in Telugu

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ ముందే ఊహించాడా..? వైరల్‌గా మారిన ‘భారత్‌’ కామెంట్స్‌


Pawan Kalyan: ఇండియా కాస్త భారత్‌గా మారనుందా? ఇదే ఇప్పుడు హాట్‌ టాపిక్‌.. దానికి ప్రధాన కారణం.. మన దేశం పేరును ‘ఇండియా’ అని కాకుండా జీ20 సమ్మిట్ ఆహ్వాన పత్రికలో ‘భారత్’ అని పేర్కొనడంతో.. ఇండియా త్వరలోనే మాయం కాబోతోందా? భారత్‌గా మార్చేందుకు నిర్ణయం తీసుకున్న తర్వాతే ఈ చర్యకు పూనుకున్నారా? అనేది చర్చనీయాంశంగా మారిపోయింది.. జీ20 సమ్మిట్ ఆహ్వాన పత్రికలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ‘ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’కి బదులు ‘ది ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని ప్రింట్‌ చేయడంతో ఈ చర్చ మొదలైంది.. దీనిపై పెద్ద వివాదమే రేగుతోంది.. విపక్షాలు దీనిని తప్పుపడుతుండగా.. కొందరు సినీ, క్రికెట్‌ ప్రముఖులు మద్దతుగా నిలుస్తున్నారు.. ఇదే సమయంలో.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ గతంలో చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారిపోయాయి..

ఇంతకీ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ ‘భారత్‌’ గురించి ఏమన్నారు? ఏ సందర్భంలో ఆ చర్చ వచ్చిందనే వివరాల్లోకి వెళ్తే.. తన అన్నయ్య, టాలీవుడ్‌ మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా నర్సింహారెడ్డి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరయ్యారు పవన్‌ కల్యాణ్.. ఆ ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ.. భారత్‌పై కొన్ని వ్యాఖ్యలు చేశారు.. ఇప్పుడు ‘ఇండియా’ను ‘భారత్’ అని మారుస్తున్నారన్న దానిపై జోరుగా చర్చ సాగుతోన్న సమయంలో.. పవన్ కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారిపోయాయి.. ఇంతకీ పవన్‌ ఏం మాట్లాడంటే.. ‘ఇండియా అనేది బ్రిటీష్ వాళ్లు పెట్టిన పేరు.. భారతదేశం అనేది మనది’ అంటూ వ్యాఖ్యానించారు పవర్ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌.. అయితే, ప్రస్తుతం ఆ వీడియోను జనసేన కార్యకర్తలు, పవన్‌ ఫ్యాన్స్‌ షేర్ చేస్తూ ఉండడంతో సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది.. ఇక.. కేంద్ర ప్రభుత్వ చర్యపై ఓ వైపు తీవ్రస్థాయిలో విమర్శలు వినిపిస్తుండగా.. పవన్‌ గతంలో చేసిన కామెంట్లపై కూడా నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.