ప్రభుత్వ సంస్థల్లో ఒకటైన పోస్టాఫీస్ ప్రజలకు ఎన్నో అద్భుతమైన పథకాలను అందిస్తుంది.. వీటిల్లో డబ్బులను పెడితే ఎటువంటి రిస్క్ లేకుండా మంచి లాభాలను పొందవచ్చు.. మీరు పెట్టిన డబ్బులకు రిస్క్ ఉండదని చెప్పుకోవచ్చు. అదే బ్యాంకుల్లో డబ్బులు పెడితే రూ.5 లక్షల వరకే హామీ ఉంటుంది. పోస్టాఫీస్ అందిస్తున్న స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌లో కిసాన్ వికాస్ పత్ర కూడా ఒకటి. కేవీపీ స్కీమ్‌లో డబ్బులు పెడితే రెట్టింపు రాబడి పొందొచ్చు.. అంటే మీ అమౌంట్ కు డబుల్ అని.. అయితే ఈ స్కీమ్ 115 నెలలు మెచ్యూరిటీ సమయం.. ఈ స్కీమ్ గురించి మరిన్ని వివరాలు..
కిసాన్ వికాస్ పత్ర పథకంలో చేరాలంటే కనీసం రూ.1000 ఉంటే సరిపోతుంది. గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. ఎంత డబ్బు అయినా ఇన్వెస్ట్ చేయొచ్చు. ప్రస్తుతం ఈ స్కీమ్‌పై 7.5 శాతం వడ్డీ లభిస్తోంది. 115 నెలల్లో డబ్బు రెట్టింపు అవుతుంది. అంటే రూ.5 లక్షలు పెడితే.. రూ.10 లక్షలు అవుతుంది.. మీరు మీ దగ్గరలోని పోస్టాఫీస్ ఆఫీస్ కు వెళ్లి ఈ స్కీమ్ లో చేరవచ్చు..
ఉదాహరణకు మీరు ఈ కీమ్‌లో రూ. 5 లక్షలు పెడితే.. మీకు రూ.10 లక్షలకు పైగా వస్తాయి. రిస్క్ లేకుండానే రాబడి సొంతం చేసుకోవచ్చు.. ఇదే కాదు మరో స్కీమ్ కూడా ఉంది.. రికరింగ్ డిపాజిట్ స్కీమ్ కూడా ఉంది. ప్రతి నెలా చిన్న మొత్తంలో డబ్బులు దాచుకోవాలని భావించే వారికి ఇది బెస్ట్ స్కీమ్.. 6.5 శాతం వడ్డీని పొందవచ్చు.. అదే విధంగా నేషనల్ సేవింగ్స్ టటమ్ డిపాజిట్ కూడా ఉంది. సకమ్ మెచ్యూరిటీ ఏడది నుంచి ఐదేళ్ల వరకు టుంది. టెన్యూర్ ఆధారంగా వడ్డీ రేటు మారుతుంది. ఏడాది టెన్యూర్ అయితే 6.9 శాతం వడ్డీ పడుతుంది. రెండేళ్ల టెన్యూర్ అయితే 7 శాతం వడ్డీ లభిస్తుంది. మూడేళ్ల టెన్యూర్‌పై 7 శాతం వడ్డీ వస్తుంది. ఇక ఐదేళ్ల టెన్యూర్‌పై 7.5 శాతం వడ్డీ వస్తోంది. అంటే టెన్యూర్ ఆధారంగా మీకు వచ్చే రాబడి కూడా పెరుగుతుంది.. ఇవేకాదు పోస్టాఫీస్ లో ఇంకా ఎన్నో స్కీమ్ లు అందుబాటులో ఉన్నాయి.. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ట్రై చెయ్యండి..