Leading News Portal in Telugu

Woman Dead Body: మూసిలో కొట్టుకొచ్చిన డెడ్ బాడీ.. ఆ మహిళ అనే అనుమానం..!


Woman Dead Body: నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ నగరం చిగురుటాకులా వణుకుతోంది. భారీ వర్షాలకు రోడ్లు, లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. ఎగువ నుంచి వస్తున్న వరదతో మూసీనది ఉధృతంగా ప్రవహిస్తోంది. జంట జలాశయాలు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నిండుతుండగా గేట్లు ఎత్తి మూసీలోకి నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో మూసారాంబాగ్ వంతెన వద్ద నీటి ప్రవాహం పెరిగింది. వంతెన సమీపంలో వరద నీరు ప్రవహించడంతో మంగళవారం (సెప్టెంబర్ 5) రాత్రి 9 గంటల నుంచి ముసారాంబాగ్ వంతెనపై రాకపోకలు నిలిచిపోయాయి. ఇటీవల ముసారాంబాగ్ వంతెనపై వరద తగ్గుముఖం పట్టడంతో ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్‌కు అనుమతి ఇచ్చారు.

మూసీ వరద నీటితో వంతెనపై పేరుకుపోయిన చెత్తను జీహెచ్‌ఎంసీ కార్మికులు తొలగిస్తున్నారు. వంతెన వద్ద చెత్తను తొలగిస్తుండగా గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. మూడు రోజుల క్రితం హుస్సేన్ సాగర్ నాలాలో అదృశ్యమైన లక్ష్మి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. వరద నీటిలో లక్ష్మి మృతదేహాన్ని బయటకు తీసి మృతదేహాన్ని గుర్తించేందుకు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. లక్ష్మి కూతురు అక్కడికి చేరుకుని ఆమె చేతిపై ఉన్న పచ్చబొట్టు, ముక్కు పగలడం ఆధారంగా తల్లి లక్ష్మిగా గుర్తించారు. అమ్మ మాకు దూరం అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎడమ చేతిపై తన స్నేహితురాలి పచ్చబొట్టు పేరు కమలమ్మ అని రాయించుకుందని తెలిపారు. ముకుపుల్ల & పచ్చబొట్టు దాని ఆధారంగా మా అమ్మ మృతదేహంగా గుర్తించామన్నారు. తన తల్లి లక్ష్మి మృతదేహం కోసం నాలుగు రోజులు వెతకామని తెలిపారు. అధికారులు తీవ్రంగా శ్రమించారని, ఈ రోజు మా అమ్మ మాకు లేదని కన్నీరుమున్నీరయ్యారు.

Read also: Hyderabad: ఒకే రోజు గణేష్ నిమజ్జనం, మిలాద్-ఉన్-నబీ.. టైమింగ్‌ మారుస్తారా..?

మూడు రోజుల క్రితం గల్లంతు..
గాంధీనగర్‌కు చెందిన లక్ష్మి అనే మహిళ నాలుగు రోజుల క్రితం హుస్సేన్ సాగర్ నాలాలో అదృశ్యమైంది. ఆమె నాలాపై ఇల్లు కట్టుకుంది. ఇటీవల వర్షం కారణంగా ఇంటి గోడ కూలిపోయింది. సోమవారం ఉదయం నుంచి ఆమె కనిపించకుండా పోయింది. అయితే ఆమె నాలాలో పడి కొట్టుకుపోయి ఉంటుందని స్థానికులు అనుమానిస్తున్నారు. ఆమె ఇంట్లోకి వెళ్లిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఇంట్లోకి వెళ్లిన లక్ష్మి అదృశ్యమైంది. కుటుంబ సభ్యులు నాలా దగ్గర లక్ష్మి కంకణాలు గుర్తించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రెస్క్యూ టీం గాలింపు చర్యలు చేపట్టినా ఆమె ఆచూకీ లభించలేదు. తాజాగా ఆమె మృతదేహాన్ని అధికారులు గుర్తించారు.
Bharat: తాజాగా “ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్”.. మరోసారి పేరు మార్పు..