Rohit Sharma Epic Reaction After Agarkar Confirms His Name In Indian Team: స్వదేశంలో జరగనున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, కెప్టెన్ రోహిత్ శర్మ సంయుక్తంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. 15 మందితో కూడిన జట్టును ప్రకటించారు. అయితే అగార్కర్ మెగా టోర్నీలో పాల్గొనే భారత పేర్లను ప్రకటించే సమయంలో రోహిత్ రియాక్షన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
మీడియా సమావేశంలో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ భారత జట్టులోని ఒక్కొక్కరి పేరు చదివి వినిపించాడు. ముందుగా కెప్టెన్ రోహిత్ శర్మ పేరును ప్రకటించాడు. తన పేరు వినగానే రోహిత్ ఒక్కసారిగా సంబరపడిపోయాడు. చేతిని పైకెత్తి హే అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియో చూసిన ఫాన్స్ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. ‘రోహిత్ భయ్యా.. నువ్ ఎలాగూ ఉంటావ్ కదా’, ‘రోహిత్ బ్రో.. నువ్ లేకుండా జట్టు ఉంటుందా’ అని సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.
ప్రపంచకప్ 2023కి భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, మొహ్మద్ షమీ, మొహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా.
Team India for World Cup 2023.
Rohit’s reaction 😂 pic.twitter.com/FDh4Ah7uq9
— Cricketopia (@CricketopiaCom) September 5, 2023