Leading News Portal in Telugu

Moto G54 5G Price: మోటో జీ54 స్మార్ట్‌ఫోన్‌ వచ్చేసింది.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ!


Moto G54 5G Smartphone Launch and Price in India: అమెరికాకు చెందిన ‘మోటోరోలా’కు భారత మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఎప్పటికప్పుడు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను రిలీజ్ చేస్తూ.. మొబైల్ ప్రియులను తనవైపు తిప్పుకుంటోంది. ఇటీవల మోటో ఎడ్జ్ 40ని రిలీజ్ చేసిన మోటోరోలా కంపెనీ.. నేడు మోటో జీ54ను భారత్‌లో విడుదల చేసింది. ఈ ఫోన్‌ 5జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్‌ చేస్తుంది. మీడియాటెక్‌ డైమెన్సిటీ ప్రాసెసర్‌ కలిగి ఉన్న మోటో జీ54 స్మార్ట్‌ఫోన్‌లో 12GB ర్యామ్‌, గరిష్ఠంగా 256GB వరకు స్టోరేజ్‌ ఉంది.

Moto G54 5G Launch:
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ఎంపిక చేసిన రిటైల్‌ స్టోర్లలో మోటో జీ54 స్మార్ట్‌ఫోన్‌ సెప్టెంబరు 13 నుంచి విక్రయానికి అందుబాటులోకి రానుంది. లాంఛ్‌ ఆఫర్‌ కింద ఐసీఐసీఐ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ ద్వారా కొనుగోలు చేసేవారికి రూ.1000 రాయితీ లభించనుంది. అంతేకాదు రూ. 668 నుంచి ఈఎంఐ ఆప్షన్‌ కూడా అందుబాటులో ఉంది.

Moto G54 5G Price:
మోటో జీ54 స్మార్ట్‌ఫోన్‌ బేస్‌ మోడల్‌ 8GB RAM + 128GB వేరియంట్‌. దీని ధర రూ. 15,999గా ఉంది. టాప్‌ ఎండ్‌ మోడల్‌ 12GB RAM + 256GB ధర రూ. 18,999గా కంపెనీ పేర్కొంది. ఈ ఫోన్ మూడు (మిడ్‌నైట్‌ బ్లూ, మింట్‌ గ్రీన్‌, పర్ల్‌ బ్లూ) రంగుల్లో అందుబాటులో ఉంది. డ్యుయల్‌ సిమ్‌ నానో స్లాట్స్‌తో వస్తున్న ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 13 My UI 5.0 ఓఎస్‌తో పనిచేస్తుంది. 120Hz రీఫ్రెష్‌ రేటుతో 6.5 ఇంచెస్ ఫుల్‌ హెచ్‌డీ+ స్క్రీన్ ఉంది. ఆక్టాకోర్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7020 ప్రాసెసర్‌ను ఈ ఫోన్ కలిగి ఉంటుంది.

Moto G54 5G Camera:
మోటో జీ54 వెనుక భాగంలో 50MP ప్రధాన కెమెరా అండగా.. సెల్ఫీల కోసం 16MP కెమెరా ఉంది. వైఫై, బ్లూటూత్‌, జీపీఎస్‌, ఏ-జీపీఎస్‌, యూఎస్‌బీ టైప్‌-సి వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. 3.5ఎంఎం హెడ్‌ఫోన్‌ జాక్‌ కూడా ఉంది. ఈ ఫోన్‌కి సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌ ఉంది. డాల్బీ అట్మోస్‌ టెక్నాలజీతో కూడిన స్టీరియో స్పీకర్లు వస్తున్నాయి.

Moto G54 5G Battery:
మోటో జీ54 స్మార్ట్‌ఫోన్‌ శక్తివంతమైన బ్యాటరీతో వస్తుంది. ఇందులో 6,000mAh బ్యాటరీ ఉండడం విశేషం. 33W టర్బోపవర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది.