DK Aruna: గద్వాల ఎమ్మెల్యే కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు వెంటనే డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ గెజిట్‌ను ప్రచురించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిన సంగతి తెలిసిందే. హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని రెండు రోజుల క్రితం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అసెంబ్లీ కార్యదర్శికి ఈసీ లేఖ రాసింది. అయితే డీకే అరుణను ఎమ్మెల్యేగా గుర్తిస్తూ గెజిట్ ప్రచురించాలని ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేయడంతో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. అరుణ ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేనా? లేక బీజేపీ ఎమ్మెల్యేనా? గందరగోళం ఏర్పడింది.
Read also: Salaar: సలార్ వాయిదానే పడలేదు.. అప్పుడే మోహరించిన నాలుగు సినిమాలు!
2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా డీకే అరుణ పోటీ చేశారు. ఆమె దాదాపు 28 వేల ఓట్ల తేడాతో బీఆర్‌ఎస్ అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అయితే తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసినందుకు కృష్ణమోహన్ రెడ్డిపై అనర్హత వేటు వేయాలని డీకే అరుణ ఆ తర్వాత హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరుగుతుండగానే.. ఆమె బీజేపీలో చేరారు. ప్రస్తుతం ఆమె బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. అయితే తాజాగా ఆమెను గద్వాల ఎమ్మెల్యేగా హైకోర్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం గెజిట్ విడుదల చేయాలని లేఖ కూడా రాసింది. ఈసీ ఆదేశాల మేరకు డీకే అరుణ ఎమ్మెల్యేగా గుర్తిస్తే.. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా రికార్డుల్లోకి ఎక్కనున్నారు. 2018లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఆమె సాంకేతికంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం ఆమె బీజేపీలో ఉన్నారు. అయితే ఎమ్మెల్యేగా ప్రకటించిన తర్వాత ఆమె బీజేపీలో కొనసాగితే ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తిస్తుందా? అనేది ప్రశ్న. ఎమ్మెల్యేగా ఫిరాయించని అరుణకు ఫిరాయింపుల నిరోధక చట్టం ఎలా వర్తిస్తుంది? అని కొందరు వాదిస్తున్నారు. అయితే ఆమెను ఎమ్మెల్యేగా ప్రకటించిన తర్వాత బీజేపీలో కొనసాగితే కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
Hyderabad Rains: కనీసం కరెంట్ లేదు.. త్రాగడానికి నీళ్లు లేవు.. జర పట్టించుకోండి సారూ!