Leading News Portal in Telugu

Health Tip: మందు తాగుతారా? అయితే ఈ కూరగాయ రసం తాగండి అంతా సెట్ అయిపోతుంది


Health Benefits of Cabbage Water:  కూరగాయలన్నింటిలో ఎంతో ఉత్తమమైనది క్యాబేజీ. దీని వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అయితే ఎన్నో ఉపయోగాలు ఉన్నా దీనిని తినడానికి చాలా మంది ఇష్టపడరు. అయితే కేవలం క్యాబేజీని తినడం ద్వారానే కాదు దాని నీటిని తాగడం వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. దీని కోసం మీరు క్యాబేజీని ఉడకబెడితే చాలు. తరువాత దానిని వడగట్టి నీటిని మాత్రమే గ్లాస్ లోకి తీసుకోవాలి. దానిని తాగితే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. దీనిలో ముఖ్యంగా పొటాషియం, కాల్షియం లాంటి ఎన్నో మూలకాలు ఉన్నాయి. అవి ఎముకలు స్ట్రాంగ్ గా ఉండేందుకు ఉపయోగపడతాయి. ఇక ఈ నీరు కడుపులో ఉండే అల్సర్లు, పుండ్లను కూడా తగ్గిస్తుంది.

క్యాబేజీ నీటి ద్వారా శరీరానికి అవసరమైన ప్లేవనాయిడ్స్  సమృద్ధిగా అందుతాయి. ఇది రక్తాన్ని శుద్ది చేస్తుంది. రక్తపోటు పెరగకుండా చూస్తుంది. అంతేకాకుండా శరీరంలో రక్తం పెరగడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇక ఇది బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. శరీరంలో జీర్ణక్రియ సక్రమంగా జరిగేటట్లు చేస్తుంది. దీని వల్ల బరువు తగ్గుతారు. ఇక మందు బాబులకు కూడా ఈ నీరు మంచిగా పని చేస్తుంది. మందు తాగిన తరువాత ఎలాంటి దుష్పరిణామాలు తలెత్తకుండా చేస్తుంది. దీనిని రోజూ తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ నీరు లివర్ పని తీరును మెరుగుపరుస్తుంది. ఇక కేవలం ఆరోగ్యం కోసమే కాకుండా అందం కోసం కూడా ఈ నీరు ఉపయోగపడుతుంది. దీనిని తాగడం వల్ల చర్మంపై మచ్చలు ఉంటే అవి పోయి చర్మం కాంతివంతంగా తయారవుతుంది. అంతేకాకుండా కంటి చూపు కూడా దీనిని తాగడం వల్ల మెరుగుపడుతుంది. మనం రోజు ఎన్నెన్నో ప్రయత్నిస్తూ ఉంటాం. ఒక్కసారి ఈ క్యాబేజీ రసాన్ని కూడా తాగడానికి ప్రయత్నించండి. దీని బెనిఫిట్స్ ను పొందుతారు. దీనిలో విటమిన్ కె కూడా ఉంటుంది. కేవలం పాల నుంచి కాకుండా దీని నుంచి కూడా మనం విటమిన్ కె పొందవచ్చు. అరకప్పు ఉడకబెట్టిన క్యాబేజీలో 81.5 మైక్రోగ్రాములు విటమిన్ కే ఉంటుంది.