ఒకప్పుడు ఏదైనా కావాలంటే బయటకు వెళ్లి కొనేవాళ్ళు కానీ ఇప్పుడు ఏదైనా కావాలంటే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటున్నారు.. జనాలు ఆన్లైన్ యాప్ లపై బాగా ఆధారపడ్డారు. ఒక్కరోజు ఇవి బంద్ అయితే విలవిల లాడిపోతారు చాలామంది.. అలాంటిది మూడురోజులు ఈ డెలివరీ సర్వీసులు బంద్ అయితే ఇక జనాల పరిస్థితి ఏంటి.. అసలు మూడురోజులు ఈ సేవలు బంద్ అవ్వడానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రస్తుతం జీ20 సదస్సుకు ఈసారి మన దేశం ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ గ్లోబల్ సదస్సు సెప్టెంబ్ 9 నుంచి 1 0 వరకు జరుగుతుంది. దేశ రాజధాని ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపంలో ఉన్న కొత్త ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఈ సదస్సు జరుగుతుంది. జీ20 అనేది హైప్రొఫైల్ మీటింగ్. అందు వల్ల కేంద్ర ప్రభుత్వం న్యూ ఢిల్లీలో కొత్త ఆంక్షలు అమలులోకి తీసుకురానుంది. దీని వల్ల ఆన్లైన్ డెలివరీ, కమర్షియల్ సర్వీసులపై ప్రతికూల ప్రభావం పడుతుంది..
అందులో భాగంగానే క్లౌడ్ కిచెన్, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్, మార్కెట్లు, ఫుడ్ డెలివరీ, కమర్షియల్ డెలివరీ సర్వీసులు అన్నీ కూడా మూడు రోజుల పాటు న్యూ ఢిల్లీలో అందుబాటులో ఉండవు. క్లౌడ్ కిచెన్ అండ్ ఫుడ్ డెలివరీ సర్వీసులకు అనుమతి ఇవ్వం అని ఇప్పటికే స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) ఎస్ఎస్ యాదవ్ తెలిపారు.. అదే విధంగా అమెజాన్,ఫ్లిప్‌కార్ట్ మొదలగు కంపెనిలకు కూడా పరిమితులు లేవని తెలుస్తుంది.. కంట్రోల్డ్ జోన్లో ఎలాంటి డెలివరీ సర్వీసులు అందుబాటులో ఉండవని పేర్కొన్నారు..