Leading News Portal in Telugu

MP Laxman : దివ్యాంగుల కోసం మోడీ సర్కారు ప్రత్యేక శ్రద్ధ పెట్టింది


తెలంగాణ సర్కారు దివ్యాంగులకు పెన్షన్ ఇస్తున్నదన్న ఒకే కారణంతో వారికి రావాల్సిన రాయితీలు , ఇతర అవకాశాలను గాలికి వదిలేసిందని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు , రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ మండిపడ్డారు. కేంద్ర సర్కారు నరేంద్ర మోడీ నేత్రత్వంలో దివ్యాంగుల చట్టం 2016 తేవడంలో వారి వైకల్యాల సంఖ్య 7 నుంచి ఏకంగా 21 కి పెరిగాయని వెల్లడించారు. బంజారా ఫంక్షన్ హాల్ లో దివ్యాంగుల కోసం ట్రై సైకిల్ పంపిణీ కోసం నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు డాక్టర్ లక్ష్మణ్. అనంతరం మీడియాతో మాట్లాడారు. కేంద్ర సర్కారు దివ్యాంగులకు కార్పేరేషన్ నిధులు, సహాయ పరికరాలు వితరణకకు ప్రత్యేక క్యాంపులు పెట్టి సహాయపడుతోందన్నారు.

విద్యాభ్యాసం కోసం ప్రత్యేకంగా స్కాలర్ షిప్ లు పెట్టి వారి ఉన్నత విధ్యకు తోడ్పడుతున్నారని, డిజేబుల్ ఫైనాన్స్ కార్పోరేషన్ కింద 875 కోట్లు మోదీ సర్కరు విడుదల చేసిందన్నారు. తద్వారా దివ్యాంగులకు స్వయం ఉపాధి లభిస్తోందని, దీన్ దయాల్ డిసేబుల్డ్ రిహాబిలలిటేషన్ పథకం ద్వారా 508 కోట్లు విడుదల చేసిందన్నారు. దివ్యాంగులకు సహాయ పడే ఎన్జీవో ల కోసం 300 కోట్ల గ్రాంట్లను కేంద్రం విడుదల చేసిన విషయాన్ని ఉటంకించారు. కానీ తెలంగాణ సర్కారు సమయానికి సదరం క్యాంపులు కూడా నిర్వహించుకుండా వేలాది మంది దివ్యాంగుల ఉసురు పోసుకుంటోందని దుయ్యబట్టారు.