Alia Bhatt: బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకపక్క సినిమాలు .. ఇంకోపక్క బిజినెస్.. మరోపక్క కుటుంబ బాధ్యతలతో ఆమె ఎడతెరిపి లేకుండా పనిచేస్తోంది. ఈ మధ్యనే ప్రొడక్షన్ రంగంలోకి అడుగుపెట్టిన అలియా.. ఆఫీస్ కోసం ముంబైలో కోట్లు ఖర్చుపెట్టి ప్లాట్ తీసుకుంది. త్వరలోనే అలియా ప్రొడక్షన్ హౌస్ మొదలుకానుంది. ఇక ఇప్పుడు మరో కొత్త బిజినెస్ లోకి అడుగుపెట్టింది. అది కూడా ప్రపంచంలోనే రిచ్చెస్ట్ పర్సన్స్ అయిన ముఖేష్ అంబానీ కుటుంబంతో కలిసి ఈ చిన్నది వ్యాపారం చేయనుంది. 2020 లో ఎడ్-ఎ-మమ్మా అనే క్లాతింగ్ స్టోర్ ను అలియా మొదలుపెట్టిన విషయం తెల్సిందే.
Sreeleela: క్రేజీ ప్రాజెక్ట్ నుంచి శ్రీలీల అవుట్.. గుంటూరు కారం అయితే కాదుగా.. ?
చిన్నారులు, టీనేజర్స్ కు వారికి తగినట్టు డ్రెస్ లను అందిస్తుంది. ఇక ఎన్నోసార్లు అలియా.. మహేష్ కూతురు సితారకు డిజైన్ చేసి డ్రెస్ లు కూడా పంపింది. ఇక ఈసారి తన బ్రాండ్ ను ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లడానికి అంబానీ కుటుంబంతో చేతులు కలిపింది. ప్రపంచంలోనే రిచ్చెస్ట్ పర్సన్ అయిన ముఖేష్ అంబానీ ముద్దుల తనయ ఇషా అంబానీతో ఆమె కొలాబరేట్ అయ్యింది. బూట్స్ట్రాప్డ్ వెంచర్ ఎడ్-ఎ-మమ్మా, రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ రెండు చేతులు కలిపాయని, ఇకనుంచి ఇద్దరం కలిసి వ్యాపారం సాగిస్తామని అలియా చెప్పుకొచ్చింది. ఇషా అంబానీతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. తల్లులమైన తామిద్దరం కలిసి.. ఇలా ఈ వ్యాపారం కోసం చేతులు కలపడం ఎంతో అద్భుతమని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.