Leading News Portal in Telugu

Challa Dharma Reddy : కొండా మురళీపై ఎమ్మెల్యే చల్లా పరోక్ష విమర్శలు


వరంగల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు కొండా మురళీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. చేతకానోళ్లే తొడలు కొడతారని.. మీసాలు తిప్పుతారని అన్నారు. ఇలా సవాలు చేసిన వాళ్లు వెళ్లిపోయాక పరకాలలో గొడవలు, ఘర్షణలు లేని వాతావరణం ఉందన్నారు. మళ్లీ అలాంటి పరిస్థితి తేవొద్దని ఆయన సూచించారు.. సంగెం మండలంలో పలు అభవృద్ధి పనులకు మంత్రి ఎర్రబెల్లి దయాకరరావుతో కలిసి స్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు ఎమ్మెల్యే చల్లా. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ కామెంట్ చేయడం హాట్‌ టాపిక్ గా మారింది.

కాంగ్రెస్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితబంధు, రైతుబీమా, కళ్యాణలక్ష్మి పథకాలు ఉన్నాయా? అని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రశ్నించారు. ధరణి పోర్టల్ భారతదేశంలోనే అద్భుతమైన సైట్ అన్న ధర్మారెడ్డి కాంగ్రెస్ నేతల భూముల పైనా వాళ్ల ఆటలు సాగడం లేదనే ధరణి తీసేస్తామంటున్నారని చల్లా ధర్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో 24 గంటల పాటు విద్యుత్ ఇస్తున్నామని.. అది చూసి మిగిలిన రాష్ట్రాలు కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి వచ్చిందని చల్లా ధర్మారెడ్డి వ్యాఖ్యానించారు రాష్ట్రాన్ని ఎన్నో ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ సైతం ఎప్పుడూ కూడా 24 గంటల పాటు కరెంట్ ఇచ్చిన దాఖలాలు లేవని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దని, పరకాలలో జరిగిన అభివృద్ధిని చూసే తనకు ఓటు వేయాలని చల్లా ధర్మారెడ్డి కోరారు.