Chitta Teaser: బొమ్మరిల్లు హీరో సిద్దార్థ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత కొంతకాలంగా సినిమాలుకు దూరంగా ఉన్న సిద్దార్థ్ ప్రస్తుతం వరుస సినిమాలతో ప్రేక్షకులు అలరించడానికి రెడీ అవుతున్నాడు. ఈ మధ్యనే టక్కర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అతను పరాజయాన్ని అందుకోవాల్సి వచ్చింది. దీంతో ఎలా అయినా ఈసారి హిట్ కొట్టాలని ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సిద్దార్థ్, నిమిషా సజాయన్ జంటగా ఎస్ యు అరుణ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం చిత్తా. ఈతకి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సిద్దార్థ్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక దీంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ తాజాగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు.
Jawan: రేపు రిలీజ్ పెట్టుకొని బాయ్ కాట్ ఏంటిరా.. ?
టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. కూతురు కోసం ఒక తండ్రి చేసే పోరాటమే ఈ సినిమా అని టీజర్ ను బట్టి అర్థమవుతుంది. తల్లి లేని బిడ్డతో చిత్తా అనే వ్యక్తి నివసిస్తూ ఉంటాడు. కూతుర్ని స్కూలుకు పంపించడం, తీసుకురావడం తన పని తను చూసుకోవడం తప్ప వేరే విషయంలో జోక్యం చేసుకొని చిత్తాకు ఒకరోజు స్కూల్ నుంచి ఫోన్ వస్తుంది. అక్కడ తన కూతురు ఏడుస్తూ కనిపిస్తూ ఉంటుంది. ఆమెకు ఏమైందో అని టీచర్స్ ను అడగడానికి చిత్తా బయలుదేరుతాడు. ఇక ఆ ఘటన తరువాత వారి జీవితాలు మారిపోతాయి. పోలీస్ కేసు అంటూ తిరుగుతూ ఉంటాడు. అసలు చిత్త ఎవరు..? అతని కూతురుకి ఏమైంది..? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇప్పుడున్న సమాజంలో చైల్డ్ అబ్యూజ్ కామన్ అయిపోయింది. చిన్నారులను కొందరు కామాంధులు చిదిమేస్తున్నారు. ఈ టీజర్ ను బట్టి ఇది కూడా అదే కథలా కనిపిస్తుంది. ఇక ఒక తండ్రిగా.. కూతురును ఆ విధంగా ఏడిపించిన వారిపై పగ తీర్చుకోనే పాత్రలో సిద్దార్థ్ అదరగొట్టేశాడు. ప్రస్తుతం ఈ టీజర్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో సిద్దార్థ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.