Leading News Portal in Telugu

Oppo A38 Price: ఒప్పో నుంచి మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ!


Oppo A38 Smartphone Launch and Price: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ ‘ఒప్పో’.. ఏ సిరీస్‌లో మరో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ‘ఒప్పో ఏ38’ పేరుతో యూఏఈ, మలేషియా మార్కెట్‌లో రహస్యంగా రిలీజ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ త్వరలో భారత మార్కెట్‌లో కూడా అందుబాటులో ఉంటుందని సమాచారం. సరైన రిలీజ్ డేట్ ఇంకా తెలియరాలేదు. ఒప్పో ఏ38 ఫోన్ ఒకే కాన్ఫిగరేషన్‌లో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ తక్కువ ధరలో అనేక అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది. ఆ వివరాలు ఓసారి చుద్దాం..

Oppo A38 Specs:
ఒప్పో ఏ38 స్మార్ట్‌ఫోన్‌ హెచ్‌డి ప్లస్ రిజల్యూషన్‌తో 6.56 ఇంచెస్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. డిస్‌ప్లే 100 శాతం డీసీఐ-పీ3 మరియు sRGB కలర్‌లను కవర్ చేస్తుంది. ఇది మీకు గొప్ప అనుభూతిని అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్ హీలియో G85 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఇది 4GB RAM, 128GB స్టోరేజ్ కలిగి ఉండగా.. మైక్రో ఎస్డీ కార్డ్‌ ద్వారా 256GB వరకు విస్తరించవచ్చు.

Oppo A38 Camera:
ఒప్పో ఏ38 స్మార్ట్‌ఫోన్‌ 50MP ప్రధాన కెమెరాను f/1.8 ఎపర్చర్‌తో కలిగి ఉంది. అద్భుత షాట్‌ల కోసం 2MP పోర్ట్రెయిట్ లెన్స్ కూడా ఇందులో ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 5MP కెమెరా కూడా ఈ స్మార్ట్‌ఫోన్‌లో అందుబాటులో ఉంది.

Oppo A38 Battery:
ఒప్పో ఏ38 ఫోన్ భారీ 5,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది 33W సూపర్ వూక్ ఛార్జింగ్‌తో ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఇది డ్యూయల్ సిమ్ ఫోన్. 4G VoLTE, Wi-Fi, బ్లూటూత్ 5.0, GPS, USB-C పోర్ట్ మరియు హెడ్‌ఫోన్‌ల కోసం 3.5mm ఆడియో జాక్‌తో ఈ ఫోన్ వస్తుంది. సైడ్-ఫేసింగ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ కూడా ఇందులో ఉంది.

Oppo A38 Price:
ఒప్పో ఏ38 స్మార్ట్‌ఫోన్‌ మలేషియాలో 4GB RAM మరియు 128GB స్టోరేజ్‌తో అందుబాటులో ఉంది. దీని ధర దాదాపుగా రూ. 10,500గా ఉంటుంది. ఈ ఫోన్ గ్లోయింగ్ బ్లాక్ మరియు గ్లోయింగ్ గోల్డ్ కలర్ వేరియంట్‌లలో వస్తుంది.