లోకనాయకుడు కమల్ హాసన్ విక్రమ్ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు. కోలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ రాబట్టిన విక్రమ్ మూవీ, కమల్ హాసన్ ని యాక్షన్ హీరోగా మరోసారి పరిచయం చేసింది. ఒక బీస్ట్ ఫైట్ చేసినట్లు కమల్ హాసన్, క్లైమాక్స్ లో గన్స్ ఫైర్ చేస్తుంటే ఫ్యాన్స్ పిచ్చెక్కి పోయారు. దీంతో కమల్ హాసన్ మళ్లీ టాప్ హీరోల రేస్ లోకి వచ్చేసాడు. ప్రస్తుతం శంకర్ తో ఇండియన్ 2 సినిమా చేస్తున్న కమల్ హాసన్, ఈ మూవీతో మరోసారి పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తున్నాడు. షూటింగ్ కంప్లీట్ అయ్యే స్టేజ్ లో ఉన్న ఇండియన్ 2 తర్వాత కమల్ హాసన్, హెచ్ వినోద్ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు.
ఖాకీ, నెర్కొండ పార్వై, వలిమై, తునివు లాంటి సినిమాలతో కోలీవుడ్ తనకంటూ స్పెషల్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు హెచ్ వినోద్… యాక్షన్ సీన్స్ ని గూస్ బంప్స్ వచ్చే రేంజులో డిజైన్ చేసుకోవడం హెచ్ వినోద్ స్టైల్. ఇలాంటి డైరెక్టర్ తో కమల్ హాసన్ తన నెక్స్ట్ సినిమా చేస్తున్నాడు. కమల్ హీరోగా నటిస్తూ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీ అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇప్పటికే వచ్చేసింది. ఇండియన్ 2 కంప్లీట్ అవ్వగానే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ మూవీ కోసం కమల్ హాసన్ ట్రైనింగ్ స్టార్ట్ చేసాడు. ఈ ట్రైనింగ్ కి సంబంధించిన వీడియోని మేకర్స్ రిలీజ్ చేసారు, ఇందులో కమల్ హాసన్ భారీ గన్స్ ని కాలుస్తూ విక్రమ్ ని గుర్తు చేస్తూ ఉన్నాడు. మరి కమల్ హెచ్ వినోద్ తో కలిసి విక్రమ్ రేంజ్ సినిమాని పాన్ ఇండియా ఆడియన్స్ కి ఇస్తారేమో చూడాలి.
Guts & Guns 🔥
Training Begins #FuriousAction in #KH233#Ulaganayagan #KamalHaasan #RKFI52 #RISEtoRULE@ikamalhaasan #Mahendran #HVinoth@RKFI @turmericmediaTM @magizhmandram pic.twitter.com/Mec86yIhlh
— Raaj Kamal Films International (@RKFI) September 7, 2023