posted on Sep 7, 2023 2:04PM
సనాతన ధర్మాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేసిన తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ తల్లి దుర్గా స్టాలిన్ హిందూయిజాన్ని ఫాలో అవుతూ హిందూ దేవుళ్లు, దేవతాలను ఆరాధించే పరమ భక్తురాలు. నాస్తికులైన తన భర్త సీఎం స్టాలిన్ , మామ కరుణానిధి , కొడుకు తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఉన్న ఇంట్లోనే ఆమె సాంప్రదాయ పూజా గది చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి. కన్న కొడుకు సనాతన ధర్మాన్నిదూషించడం దేశ వ్యాప్తంగా సంచలనమైంది. అయోధ్య కు చెందిన స్వామి ఒకరు ఆయన తలకు వెలకట్టారు కూడా.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సతీమణి దుర్గా స్టాలిన్ గురువాయూర్ ఆలయానికి బంగారు కిరీటాన్ని సమర్పించారు. దుర్గా స్టాలిన్గురువాయూర్ చేరుకున్నప్పటికీ మధ్యాహ్నం పూజ సమయంలో మాత్రమే ఆమె దర్శనం చేసుకున్నారు. నేషనల్ టీవీ మీడియాకు ఈ విజువల్స్ చిక్కాయి. హిందుత్వవాదులను మెప్పించడానికే ఆమె బంగారు కిరీటాన్ని బహుకరించి నా కొడుకు బంగారమని చెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు కనబడిందని విమర్శకులు అంటున్నారు. పనిలో పనిగా ఆమె పూజాగదిలో ఉన్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని సమాజానికి చెబుతున్న ఉదయనిధి ముందు తల్లికే చెప్పాలని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. భర్త స్టాలిన్ చెబితే వినదు, మామ కరుణానిధి చెబితే వినని దుర్గా స్టాలిన్ కొడుకు చెబితే వింటుందా అని వారు ప్రశ్నిస్తున్నారు.
గురువార్ ఆలయ సందర్శన వెనక ఉదయనిధి వ్యాఖ్యల్ని సొమ్ము చేసుకునే కుట్ర కోణం కూడా కనబడుతుందని పరిశీలకులు చెబుతున్నారు. ఉదయనిధికి చెందిన స్వంత సినిమా సంస్థ రెడ్ జియాంట్ షారూఖ్ నటించిన జవాన్ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. దేశవ్యాప్తంగా హిందీలో రిలీజవుతుంది. మలేషియా, సింగపూర్, బంగ్లాదేశ్, స్పెయిన్ దేశాల్లో కూడా రిలీజవుతుంది. కొడుకు డిస్ట్రిబ్యూట్ చేసిన ఈ సినిమా లాభాల పంట కురిపించాలని ఈ తల్లి ఆశపడొచ్చు. తప్పేంలేదు.కొడుకు స్టేట్ మెంట్ తో రాజకీయంగా హిందూ వోటర్ల తో బాటు ఈ చిత్ర కలెక్షన్స్ పడిపోతాయన్న అనుమానం వచ్చి దుర్గా స్టాలిన్ ఓ డ్రామా ఆడినట్టు పలువురు చెవులు కొరుక్కుంటున్నారు.