Leading News Portal in Telugu

Etela Rajender: రుణ మాఫీ కింద కట్టింది కేవలం రూ.12 వేల కోట్లే


కాకతీయ యూనివర్సిటీ లో పీహెచ్డీ అడ్మిషన్స్ లో అవకతవకలు జరిగాయి అని ఎబివిపి, ఇతర బీసీ విద్యార్థి సంఘాలు ఆందోళన చేశాయని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. 10 మంది విద్యార్థులను టాస్క్ ఫోర్స్ పోలీస్ లు విచక్షణ రహితంగా కొట్టారు.. ఎమ్మెల్సీ అండదండలతో వీసీ రమేష్ బీఆర్ఎస్ కి తొత్తుగా వ్యవహరీస్తున్నారు అని ఆయన ఆరోపించారు.

తెలంగాణ ఉద్యమంలో కూడా ఇలాంటి సంఘటనలు జరగలేదు అని ఈటెల రాజేందర్ అన్నారు. ఆ ఘనత కేసీఆర్ పాలన లోని రమేష్ కే దక్కింది.. అన్ని వర్సిటీలలో ఇలాంటి సంప్రదాయం వచ్చే అవకాశం ఉంది.. విద్యార్థుల డిమాండ్ కు మేము పూర్తిగా మద్దతు ఇస్తున్నాము అని ఆయన పేర్కొన్నారు. అయితే, ఈ ప్రభుత్వం మొత్తం రుణ మాఫీ చేశామని చెప్పడం శుద్ద తప్పు అని ఈటెల అన్నారు.

కేసీఆర్ ప్రభుత్వం వల్ల తెలంగాణ రైతులు ఎగవేత దారులుగా మిగిలారు అని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. రుణ మాఫీ కింద కట్టింది 12 వేల కోట్ల రూపాయలు మాత్రమేనని ఆయన ఆరోపించారు. సమయానికి డబ్బులు చెల్లించక పోవడం వల్ల రైతుల వడ్డీ పెరిగి పోయింది.. మంత్రి హరీష్ రావు వాళ్ల మీద వీళ్ళ మీద నెపం మోపే ప్రయత్నం చేస్తున్నారు అని ఆయన అన్నారు.

తెలంగాణ రైతులు అమాయకులు కాదు అని ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. వెంటనే బ్యాంక్ లకు మొత్తం పైకం చెల్లించి రైతులకు బకాయి లేకుండా చేసి.. కొత్త రుణాలు తీసుకునేలా చేయాలి అని ఈటెల డిమాండ్ చేశారు. భూములు అమ్మి రుణ మాఫీ చెల్లించారు.. లిక్కర్ టెండర్లు ముందుగా పిలిచారు.. దరఖాస్తు చేసుకున్నా.. వారు లక్షల్లో నష్ట పోయారు.. ఆ డబ్బులతో రుణమాఫీ చేశారు అని ఆయన ఆరోపించారు. డైట్ ఛార్జ్ లు సకాలంలో ఇవ్వక పోవడంతో విద్యార్థులకు నాణ్యమైన భోజనం లభించడం లేదు అని ఈటెల రాజేందర్ అన్నారు.

అబద్దాల మాటలతో కేసీఆర్ ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అని ఈటెల రాజేందర్ అన్నారు. కేసీఆర్ మోసపు మాటలు నమ్మకండి.. ఆత్మహత్యల్లో తెలంగాణ నంబర్ వన్… రైతులు సహా వివిధ వర్గాల వారు అత్నాహత్య చేసుకుంటున్నారు.. అప్పులలో, భూములు అమ్ముకోవడంలో నంబర్ వన్ అని ఆయన ఆరోపించారు. సాగర్ కింద నీళ్ళు లేక బావులు తవ్వుకుంటున్నారు.. ఎక్కడ 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదు.. ఇచ్చినట్టు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా.. ఎన్నికలు వచ్చాయి కాబట్టి అక్కడి దక్షిణ తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూస్తున్నారు అక్కడ ప్రజలు విమర్శిస్తున్నారని పాలమూరు-రంగరెడ్డి ప్రాజెక్ట్ ప్రారంభం అని నాటకం ఆడుతున్నారు అని ఈటెల పేర్కొన్నారు.