Vasireddy Padma: చట్టం ప్రశ్నించినపుడు ఎవరైనా సిద్ధపడాలని ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ వెల్లడించారు. సీఎం జగన్ కేసుల వెనుక రాజీయ ప్రేరేపితం ఉందని ప్రజలు తెలుసుకున్నారని.. చంద్రబాబు లాగా కేసుల గురించి జగన్ కన్నీళ్లు పెట్టుకోలేదని పేర్కొన్నారు. రూ.118 కోట్లను సమర్ధిస్తారా.. అంతకంటే ఎక్కువైతే సరేనా అంటూ ఆమె ప్రశ్నించారు. కవ్వింపు ఎలా జరుగుతోందో పోలీసు ఇన్వెస్టిగేషన్‌లో బయటపడుతుందన్నారు. ఏ మహిళా ఇష్యూ మీద చంద్రబాబు మాట్లాడారని.. ఎక్కడ మహిళలకు భరోసా ఇచ్చారని ఆమె ప్రశ్నించారు. మహిళలకు సంబంధించి ఒకటి అర ఉంటే బాధ్యతగా చేస్తున్నామన్నారు. మహిళా కమిషన్ బాధ్యతగా ఉంటోందన్నారు. మహిళా కమిషన్ మీద చేసిన ఏ విమర్శ అయినా ఉద్దేశ పూర్వకమే అంటూ ఆమె వ్యాఖ్యానించారు.
ఉద్యోగులు సంతోషంగా ఉంటేనే ప్రభుత్వం నడవగలదని ఆమె వ్యాఖ్యానించారు. ఉద్యోగుల కోసం ఏం చేయడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మహిళల సమస్యలపై ప్రత్యేకంగా స్పందించడం గుర్తించాలన్నారు. 50% కి పైగా మహిళలు ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నారన్నారు. మహిళా కమిషన్ ఈ నాలుగేళ్ళలో చాలా సమస్యలపై వెంటనే స్పందించిందన్నారు. నాలుగు గోడల మధ్య జరిగే అవమానానికి ఎవిడెన్సు ఉండటం లేదన్నారు. జిల్లా స్థాయిలో ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీలు పెడతామని ఆమె పేర్కొన్నారు. మహిళలకు చైల్డ్ కేర్ లీవ్‌లపై ప్రభుత్వంతో చర్చిస్తామని ఆమె వెల్లడించారు. ఒకరితో ఒకరు సహకరించుకుంటే మహిళల సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు.