తమలపాకులను శుభకార్యాలకు వాడతారు.. ఇక ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయని నిపుణులు అంటున్నారు.. తమలపాకులోని ఔషధ గుణాలు అన్ని రకాల సమస్యల నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. అలాగే ఇందులో పోషకాలు కూడా ఆరోగ్య రక్షణలో కీలక పాత్ర పోషిస్తాయి. తమలపాకులో శరీరానికి అవసరమైన విటమిన్ సి, థయామిన్, నియాసిన్, రైబోఫ్లావిన్, బీటా కెరోటిన్, కాల్షియం, కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, ఫైబర్,కాపర్, ఫాస్పరస్, ఐరన్ వంటి పలు పోషకాలు ఉన్నాయి.. తమలపాకులతో ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం..
*. తమలపాకులోని ఔషధ గుణాలు దగ్గు, బ్రాంకైటిస్, ఉబ్బసం వంటి శ్వాసకోశ వ్యాధుల చికిత్సలో ఉపయోగపడతాయి. భోజనం తర్వాత తమలపాకులను నమలడం వల్ల ఈ ఔషధ గుణాలు నేరుగా శరీరానికి లభించి ఆయా సమస్యలను దూరం చేస్తాయి..
*. తమలపాకులోని యాంటీ హైపర్‌గ్లైసీమిక్ లక్షణాలు రక్తంలోని షుగర్ లెవెల్స్‌ను అదుపులో ఉంచడానికి సహాయ పడతాయి..
*. ఒత్తిడి, ఆందోళన సమస్యలకు తమలపాకులతో ఉపశమనం పొందవచ్చు. తమలపాకులలోని ఫినాలిక్ సమ్మేళనాలు శరీరం నుంచి కాటెకోలమైన్‌లు అనే ఆర్గానిక్ సమ్మేళనాలను విడుదల చేయడం ద్వారా చాలా ప్రశాంతంగా ఉంటారు..
*. తమలపాకులు నోటి దుర్వాసనను తొలగించడంలో ఉపయోగపడతాయి. భోజనం తర్వాత తమలపాకును తినడం వల్ల నోటి దుర్వాసన, పసుపు దంతాలు, దంత క్షయం సమస్యలు దూరం అవుతాయి. తమలపాకును నమలడం వల్ల పంటి నొప్పి, చిగుళ్ల నొప్పి, వాపు, నోటి ఇన్ఫెక్షన్ వంటి ఎన్నో సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది..
*. తమలపాకులు జీర్ణ సమస్యలను తగ్గిస్తాయి..పైబర్ జీర్ణ సమస్యలను దూరం చేయడం ద్వారా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. భోజనం తర్వాత తమలపాకు తీసుకోవడం వల్ల మలబద్ధకం, అజీర్తి, కడుపు మంట, ఎసిడిటీ వంటి జీర్ణ సమస్యలు దూరం అవుతాయి.. తలనొప్పి వంటి సమస్యలు కూడా తగ్గుతాయి..