మగవాళ్ళు మందు పంచుకుంటారు.. కానీ గుండెల్లో బాధను ఎప్పుడూ పంచుకోరు.. ఎందుకంటే తన బాధ చెప్పి అవతలి వారిని ఇబ్బంది పెట్టకూడదని అనుకుంటారు.. చులకనగా చూస్తారేమో.. ఇంకేదైనా అనుకుంటారేమో అనే భావన ఉంటుంది.. అస్సలు ఎందుకు పర్సనల్స్ ఎందుకు షేర్ చేసుకోరో ఇప్పుడు తెలుసుకుందాం..
మీ భావాలను చెప్పకపోవడం అనేది మొదట్నుంచీ అలవాటు లేదు. మగవారిని కాస్తా బలమైనవారిలా చిత్రీకరించారు. అందుకే, వారి ఫీలింగ్స్‌ని ఎప్పుడైనా సరే బయటికి అస్సలు చెప్పుకోరు. ఇది మొదట్నుంచీ వస్తున్న ఆచారంలా ఫీలై పోతారు.. తప్ప ఈ బాధలను అస్సలు పట్టించుకోరు.. ఎప్పుడూ సంతోషంగా గడుపుతారు..
ఎదుటివారి ముందు తమ ఆలోచనల గురించి చెబితే వారిని తక్కువగా చూస్తారని, దీని వల్ల బాధపడతారని చెబుతుంటారు. కాబట్టి, వారి విషయాలను చెప్పడానికి భయపడతారు. అయితే, ఇవన్నీ చెబుతున్నాం కానీ, అసలు వారి బాధలు చెప్పుకుంటే జరిగే లాభాలు ఏంటో తెలుసుకోండి..
ముఖ్యంగా మీ మనసు విప్పి మాట్లాడండి.. అప్పుడు కనిపించేది చూడండి.. ఎదుటివారికి చెబితే ఒత్తిడి తగ్గుతుంది. తమ ఫీలింగ్స్‌ని హ్యాపీగా ఎక్స్‌ప్రెస్ చేస్తే నిరాశ, మానసిక సమస్యలు తగ్గుతాయని చెబుతున్నారు ఎక్స్పర్ట్స్.. అంతేకాదు మీ భావాలను వేరేవారితో ఎక్స్‌ప్రెస్ చేసినప్పుడు ఇది మీ జీవితంలోని అన్ని సంబంధాలను బలంగా చేసే నమ్మకాన్ని ఇస్తుంది.. ఎవరికి పడితే వారికి చెప్పడం కూడా మంచిది కాదు.. మనకు నమ్మకమైన వారికి మాత్రమే షేర్ చేసుకోవాలి..
మానసిక ఆరోగ్యం, భావోద్వేగాల గురించి బహిరంగంగా మాట్లాడటానికి పురుషుల్లో అవగాహన పెంచడం ముఖ్యం.చెప్పుకోలేని బాధలు ఉంటే ఎలా చెప్పుకోవాలి అనే విషయాన్ని నిపుణులు వారికి వివరించాలి.. అప్పుడే వాళ్లు ఫ్రీగా చెప్తారు..