Nandigam Suresh: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు వైసీపీ ఎంపీ నందిగం సురేష్. చంద్రబాబు బాగోతం కొద్దీ రోజులుగా బయట పడుతోందని .. ఐటీ నోటీసులకు సమాధానం చెప్పకుండా ఆయన దొంగలా తిరుగుతున్నారని ఎంపీ తీవ్రంగా మండిపడ్డారు. తెలుగువారి ఆత్మ గౌరవం గురించి మాట్లాడే బాబు ఇప్పుడు ఎక్కడ తాకట్టు పెట్టారని ప్రశ్నించారు. చంద్రబాబుకి భవిష్యత్ కనిపిస్తోందన్నారు. చంద్రబాబుకి ఐటీ నోటీసులపై పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనంగా వున్నారని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నలు గుప్పించారు. పవన్ కళ్యాణ్‌కి కూడా ఏమైనా ముడుపులు అందాయా అంటూ ఆయన అడిగారు.
చంద్రబాబు ఇప్పటికైనా తన తప్పుని ఒప్పుకోవాలన్నారు. కోడ్ భాషలో చంద్రబాబు డబ్బులు సమకూర్చుకున్నారని ఎంపీ నందిగం సురేష్ ఆరోపించారు. చంద్రబాబును కచ్చితంగా అరెస్ట్ చేస్తారని.. చంద్రబాబుకు ఐటి నోటీసులపై పవన్ ఎందుకు మౌనంగా వున్నారన్నారు. పవన్ కళ్యాణ్ నిద్ర మేల్కో, ప్రశ్నించు అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. లోకేష్‌కు సిగ్గు, శరం ఉందా ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అల్లర్లు, గొడవలు సృష్టిస్తున్నారని విమర్శించారు. లోకేష్ చేస్తుంది పాదయాత్రా అంటూ ప్రశ్నించారు. ముడుపులు తీసుకున్న వారిలో లోకేష్ కూడా ఉన్నారని ఆయన ఆరోపణలు చేశారు.