Leading News Portal in Telugu

Mahesh: మెసేజ్ ఇస్తేనే బాహుబలి రికార్డ్స్ బ్రేక్ అయ్యాయి… ఇక మాస్ సినిమా చేస్తే?


సూపర్ స్టార్ మహేష్ బాబు ఆగడు లాంటి డిజాస్టర్ ఇచ్చిన తర్వాత… అప్పటికి ఒక సినిమా అనుభవం మాత్రమే ఉన్న కొరటాల శివతో ‘శ్రీమంతుడు’ అనే సినిమా చేసాడు. ఈ మూవీ అనౌన్స్మెంట్ తో టైటిల్ పైన యాంటీ ఫాన్స్ నెగటివ్ ట్రెండ్ కూడా చేసారు. ఇలాంటి సమయంలో కొరటాల శివ రాసిన కథని మాత్రమే నమ్మి, ప్రొడక్షన్ లో కూడా పార్ట్నర్ అయ్యాడు మహేష్ బాబు. శ్రీమంతుడు సినిమాని ఆడియన్స్ లోకి తీసుకోని వెళ్లడానికి ముందుగా డ్యూటీ ఎక్కాడు దేవీ శ్రీ ప్రసాద్. దేవి ఇచ్చిన సాంగ్స్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. టీజర్, ట్రైలర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ప్రమోషనల్ కంటెంట్ లో మహేష్ బాబు “ఊరి నుంచి చాలా తీసుకున్నారు, తిరిగిచ్చెయ్యాలి” అని డైలాగ్ చెప్పడంతో ఘట్టమనేని ఫ్యాన్స్ ఈసారి హిట్ గ్యారెంటీ అనే నమ్మకంతో ఫ్యాన్స్ 2015 ఆగస్టు 7న థియేటర్స్ లోకి ఎంటర్ అయ్యారు. నిజానికి అంతకన్నా ముందే శ్రీమంతుడు సినిమా రిలీజ్ అవ్వాల్సి ఉన్నా బాహుబలి సినిమా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రైడ్, దానికి తగినంత సమయం ఇవ్వాలి అనే ఆలోచనతో మహేష్ శ్రీమంతుడు సినిమాని వాయిదా వేసాడు.

ఎట్టకేలకు ఆగస్టు నెలలో రిలీజ్ అయిన శ్రీమంతుడు సినిమా బ్లాక్ బస్టర్ రిపోర్ట్స్ ని సొంతం చేసుకుంది. ఊరిని దత్తత తీసుకోవడం అనే ఆలోచనని చాలా మందిలో కలిగించింది శ్రీమంతుడు సినిమా. ఈ మూవీ మహేష్ డైలాగ్స్ అండ్ ఫిట్నెస్ పీక్స్ లో ఉంటుంది. ముఖ్యంగా మామిడి తోట ఫైట్ సీక్వెన్స్ కి ప్రతి మూవీ లవర్ విజిల్ వేసాడు. ఒక మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాతో నాన్-బాహుబలి రికార్డ్స్ ని క్రియేట్ చేసాడు మహేష్ బాబు. అదే మెసేజ్ పక్కన పెట్టి మాస్ సినిమా చేసి ఉంటే రిజల్ట్ ఇంకే రేంజులో ఉండేదో. 2015లో రిలీజ్ అయిన శ్రీమంతుడు సినిమాని 2017లో ప్రొడ్యూసర్స్ మైత్రీ మూవీ మేకర్స్ యుట్యూబ్ లో రిలీజ్ చేసారు. ప్రస్తుతం శ్రీమంతుడు సినిమా 200 మిలియన్ వ్యూస్ రికార్డుని రీచ్ అయ్యింది. ఒక తెలుగు సినిమా తెలుగులో 200 మిలియన్ వ్యూస్ రాబట్టడం ఇదే మొదటిసారి. కొరటాల శివ రాసిన క్లాసిక్ డైలాగ్స్ కి… మహేష్ టెర్రిఫిక్ స్క్రీన్ ప్రెజెన్స్ కి శ్రీమంతుడు సినిమాని ఘట్టమనేని ఫ్యాన్స్ రిపీట్ మోడ్ లో చూస్తూ ఉంటారు కాబట్టి వ్యూస్ కౌంట్ ఇక్కడితో ఆగదు.