Home Guard Wife: ఇప్పటి వరకు వాళ్ళిద్దరిని ఎందుకు అరెస్టు చేయలేదు? సీసీ కెమెరా ఫూటేజి ఎందుకు చూపించడం లేదు? అని హోంగార్డు రవీందర్ భార్య సంధ్య సీరియస్ అయ్యారు. ఉస్మానిమాచారిలో హోంగార్డు రవీందర్ మృతదేహం అధికారులు పెట్టారు. రవీందర్ భార్య సంధ్య కోసం ఎదురుచూసారు. సంధ్య రాగానే ఆమెతో సంతకం చేయించి రవీందర్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. దీంతో ఉస్మానియా మార్చురి వద్ద భారీగా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. ముందస్తు చర్యలో భాగంగా అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హోంగార్డు రవీందర్ భార్య సంధ్య మాట్లాడుతూ.. నా భర్త గత 17 ఏళ్లుగా ఎంతో సిన్సియర్గా డ్యూటీ నిర్వహించాడని కన్నీరుమున్నీరయ్యింది. నిజాయితీగా పని చేశాడు, నాకు నిబంధనలు ఉల్లంఘించానని ఫైన్ వేశాడని తెలిపారు.
నా భర్త ఫోన్ మొత్తం అన్‌లాక్ చేసి డాటా మొత్తం డిలీట్ చేశారని మండిపడింది. నా భర్త రవీందర్ ఎంతో తెలివైన వాడని, నా భర్తతో నేను మాట్లాడిన తరువాతే చంపేశారని ఆవేదన వ్యక్తం చేసింది. నా భర్తను ఏఎస్‌ఐ నర్సింగ్ రావు, కానిస్టేబుల్ చందు లు పెట్రోల్ పోసి తగులబెట్టి చంపారని ఆరోపించారు. ఇప్పటి వరకు వాళ్ళిద్దరిని ఎందుకు అరెస్టు చేయలేదు? సీసీ కెమెరా ఫూటేజి ఎందుకు చూపించడం లేదు? అని ప్రశ్నించారు. నా భర్తను చంపిన వారి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నా కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. హమీద్ అనే అధికారి తన వద్దకు వచ్చాడని, పెట్రోల్ బంక్ లో పెట్రోల్ పోయించుకొని సిగిరెట్ తాగుతుండగా ప్రమాదం జరిగిందని చెప్పమని బెదిరించారని సంధ్య వాపోయింది. అప్పుడే బెనిఫిట్ లు అన్ని వస్తాయని.. నన్ను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారని కన్నీరుమున్నీరయైంది.
కంచన్‌బాగ్‌లోని అపోలో డీఆర్‌డీవో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హోంగార్డు రవీందర్ మృతి చెందాడు. 70% కాలిన గాయాలతో ఉన్న రవీందర్‌కు వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. అయితే నిన్న అతని పరిస్థితి మరింత విషమంగా మారింది. ఈరోజు తెల్లవారుజామున రవీందర్ తుదిశ్వాస విడిచారు. డీఆర్‌డీవో వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో డీఆర్‌డీవో వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు డీఆర్‌డీవో అపోలో వద్ద హోంగార్డుల ఆందోళన కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు హోంగార్డులు విధులు బహిష్కరిస్తున్నారు. రవీందర్ కుటుంబాన్ని ఆదుకోవాలని హోంగార్డులు కోరుతున్నారు.