Leading News Portal in Telugu

Beer: బీర్ బాబులకు కిక్ ఇచ్చే న్యూస్.. రోజూ తాగడం మంచిదేనట


Health Benefits With Beer: మందు తాగడాన్ని తప్పుగా చూస్తారు చాలా మంది. అదో చెడు అలవాటు దానికి దూరంగా ఉండాలంటూ తిడుతూ ఉంటాయి. చాలా మంది బీర్ ను ఎక్కువగా తాగుతూ ఉంటారు. చల్లని బీర్ నోటిలో నుంచి వెళుతూ ఉంటే అబ్బా స్వర్గం కనిసిస్తుందని అంటూ ఉంటారు. బీర్ కనిపిస్తే చాలు ఎప్పుడెప్పుడు తాగేద్దామా అని ఎదురు చూస్తూ ఉంటారు. అయితే అటువంటి వారికి ఫుల్ జోష్ ఇచ్చే వార్తను ఓ సర్వే తెలిపింది.దీనిని అమెరికన్ జర్నల్ ఆఫ్ మెడికల్ సైన్స్ సంస్థ.

ఇక ఈ సర్వేలో రోజూ బీర్ తాగినా మంచిదే అన్నట్లు పేర్కొన్నారు. ఏడు వేల మందికి పైగా జరిపిన అధ్యయనంలో ఈ విషయాలను తెలుసుకున్నారు. సాధారణంగా గుండె  సమస్యలు ఉన్న వారు బీరును రోజుకు ఒకటిన్నర నుంచి రెండు గ్లాసుల వరకు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని సర్వే రిపోర్ట్ లో పేర్కొన్నారు. గుండెపోటు వచ్చే అవకాశాన్ని కూడా బీర్లు తగ్గిస్తాయని సర్వే లో పేర్కొన్నారు. ఇక బీర్లలలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయని పేర్కొన్న సర్వే దీనిని తాగడం వల్ల అనేక వ్యాధులకు చెక్  పెట్టవచ్చని పేర్కొంది. ఇందులో విటమిన్ బీ, ప్రోటీనులు కూడా ఉంటాయని తెలుస్తుంది. వైన్ తో పోలీస్తే బీర్ లోనే ఎక్కువ ప్రోటీన్లు ఉంటాయని సర్వేలో తేలింది.

అంతేకాకుండా పాలలో ఏవిధంగా ఎముకల బలంగా మారడానికి కావాల్సిన పదార్ధాలు ఉంటాయో అలాగే బీరులో కూడా ఉంటాయని తెలిపింది సర్వే. ఇక మరో షాకింగ్ విషయం ఏంటంటే దంతాల ఆరోగ్యానికి కూడా ఈ బీర్ ఎంతో ఉపయోగపడుతుందట. నోటిలో క్యావిటీస్ రాకుండా చేసే ఔషధాలు బీర్ లో ఉంటాయట. అంతేకాకండా నోటిలో ఏవైనా ఇన్ఫెక్షన్ కలిగే బ్యాక్టీరియాలు లాంటవి ఉంటే అవి కూడా బీర్ దెబ్బకు పరార్ అవుతాయంట. ఇక  వారానికి దాదాపు 14 గ్లాసుల బీర్ తాగితే టైప్ 2 డయాబెటిస్ కు గురయ్యే ప్రమాదం తగ్గుతుందంట. అయితే అలా అని బీర్ బాబులు తాగటం మరీ పెంచేయకండి. ఏదైనా లిమిట్ లో ఉంటేనే అందం, ఆరోగ్యం.