Jasprit Bumrah Rejoins Indian Team Ahead Of IND vs PAK Asia Cup Super 4 Clash: ఆసియా కప్ 2023లో భాగంగా దాయాదులు భారత్, పాకిస్తాన్ జట్లు మరోసారి తలపడనున్నాయి. గ్రూప్ దశలో ఇప్పటికే ఓసారి తలపడిన ఇండో-పాక్.. సూపర్-4లో భాగంగా ఆదివారం కొలంబో వేదికగా అమీతుమీ తెల్చుకోనున్నాయి. అయితే ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌కు ముందు భారత అభిమానులకు ఓ శుభవార్త. సతీమణి డెలివరీ నేపథ్యంలో స్వదేశానికి వెళ్లిన స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తిరిగి భారత జట్టుతో కలిశాడు. ఈ మేరకు ఓ స్పోర్ట్స్ ఛానెల్ తమ నివేదికలో పేర్కొంది.
ఆసియా కప్ 2023 కోసం శ్రీలంకలో ఉన్న జస్ప్రీత్ బుమ్రా.. గత ఆదివారం హుటాహుటిన స్వదేశానికి వచ్చాడు. బుమ్రా సతీమణి, స్టార్ స్పోర్ట్స్ యాంకర్ సంజనా గణేషన్‌కు డెలివరీకి సమయం దగ్గరపడటంతో బుమ్రా ఉన్నపళంగా ముంబై చేరుకున్నాడు. సంజనా పండంటి మగబిడ్డకు సోమవారం ఉదయం జన్మనిచ్చారు. 2-3 రోజలు భార్య, కొడుకు వద్ద ఉన్న బుమ్రా.. ఆసియా కప్ కోసం శ్రీలంక చేరుకున్నాడు. శుక్రవారం భారత జట్టు శిబరంలో చేరినట్లు తెలుస్తోంది. భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌కు అతడు అందుబాటులో ఉంటాడు.
వెన్ను గాయంతో దాదాపుగా ఏడాది పాటు జస్ప్రీత్ బుమ్రా భారత జట్టుకు దూరంగా ఉన్నాడు. శస్త్రచికిత్స అనంతరం బెంగళూరులోని ఎన్సీఏలో ఫిట్‌నెస్ సాధించి.. ఇటీవల ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌తో పునరాగమనం చేశాడు. పునరాగమనంలో అద్భుత ప్రదర్శన చేసిన బూమ్ బూమ్ బుమ్రా.. ఐర్లాండ్ నుంచి నేరుగా ఆసియా కప్ 2023కోసం శ్రీలంక చేరుకున్నాడు. నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌కు దూరమయిన అతడు కీలక పాకిస్తాన్ మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చాడు.
Bumrah has joined the Indian team ahead of the Super 4. [Cricbuzz]
– Boom is back….!!!! pic.twitter.com/FzHAyDzHxj
— Johns. (@CricCrazyJohns) September 8, 2023