Health Tips For Pain in Sole Of Feet: ఎక్కువ సేపు పనిచేసినా, లేదా నిలుచున్న ఆడువారి నుంచి తరచూ వినిపించే ఫిర్యాదు అరికాళ్ల నొప్పులు. అధిక బరువు ఉన్నప్పుడు ఎక్కువ సేపు నిలుచుంటే కూడా ఈ నొప్పులు వేధిస్తూ ఉంటాయి. ప్లాంటర్ ఫాసిటిస్ అనేది అరికాళ్లకు సంబంధించిన వ్యాధి. ఇవి ఆర్డోపెడిక్ అంటే ఎముకలకు సంబంధించిన సమస్యలు కూడా కావచ్చు. అయితే ఈ అరికాళ్లలో వచ్చే నొప్పిని ఇంట్లో ఉండే వస్తువులను ఉపయోగించి కూడా నయం చేయవచ్చు. వీటి ద్వారా దాదాపు పూర్తి ఉపశమనం లభిస్తుంది.
అరికాళ్లలో నొప్పిగా ఉంటే మొదటగా ఓ సీసాలో వేడి నీళ్లు పోయండి. తరువాత ఆ సీసాను అరికాళ్ల మీద నెమ్మదిగా రుద్దుతూ మసాజ్ చేయండి. దీంతో కూడా ఉపశమనం కలుగుతుంది. అరికాళ్ల నొప్పులు తగ్గాలంటే ఇటుకను కాల్చి దాని మీద ఒక జిల్లేడు ఆకును ఉంచి మడమతో గట్టిగా తొక్కాలి. దీని వల్ల కూడా మడమ నొప్పులు, అరికాళ్ల నొప్పులు పోతాయి. ఇక ఐస్ కూాాడా అరికాళ్ల నొప్పులు పొగొట్టడానికి మంచి ఉపాయం. ఒక ప్లాస్టిక్ డబ్బాలో ఫుల్ గా నీరు పోసి అది గడ్డ కట్టే వారు ఫ్రిడ్జ్ లో ఉంచాలి. తరువాత దానిని తీసి నొప్పి ఉన్న చోట మసాజ్ చేస్తే ఆ పెయిన్ తుర్రుమంటుంది. ఇక పసుపు అనేది ప్రతి వ్యాధికి మందు అనే చెప్పుకోవచ్చు. అలాగే అరికాళ్ల నొప్పులు తగ్గడానికి ఒక బకెట్ లో చిటెకెడు పసుపు, చిటెకుడు ఉప్పు వేసి కలయబెట్టి దానిలో కాళ్లు ఉంచాలి. అప్పుడు కూడా నొప్పులు పోతాయి. ఇక మరో చిట్కాగా ఆక్యూప్రెషర్ ను చెప్ప వచ్చు. ఇది కూడా అరికాళ్ల నొప్పులు తగ్గడానికి మంచిగా ఉపయోగపడుతుంది. ఇలా ఇంట్లో ఉండే వస్తువులను ఉపయోగించే చాలా తక్కువ సమయంలో అరికాళ్ల నొప్పులను తగ్గించుకోవచ్చు. మీరు ఈ సమస్యతో బాధపడుతుంటే ఒకసారి ఇలా ట్రై చేయండి.