Leading News Portal in Telugu

G20 Summit 2023 LIVE UPDATES: జీ20 సదస్సు.. ఢిల్లీకి చేరుకున్న దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా


Live Now

G20 Summit 2023 LIVE UPDATES: జీ-20 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సుకు సర్వం సిద్ధమైంది. ఇందుకోసం పలు దేశాల అధినేతలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధుల రాక ఢిల్లీలో ఇప్పటికే సందడి మొదలైంది. ఈ నెల 9, 10 తేదీల్లో న్యూఢిల్లీలో జీ20 సదస్సు జరగనుంది. ఈ సదస్సులో ప్రపంచంలోని పలు దేశాధినేతలు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో 40 మంది ప్రపంచ చేశాలకు చెందిన ప్రతినిధులు, ఆయా దేశాల అధినేతలు పాల్గొనే అవకాశం ఉంది. ఈ సమావేశానికి కేంద్ర ప్రభుత్వం విస్తృతంగా ఏర్పాట్లు చేసింది.

  • 08 Sep 2023 03:49 PM (IST)

    ఢిల్లీకి చేరుకున్న దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా

    భారతదేశంలో జీ20 సదస్సు కోసం దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా ఢిల్లీకి చేరుకున్నారు.రైల్వే, బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి రావుసాహెబ్ పాటిల్ దాన్వే ఆయనకు స్వాగతం పలికారు. జీ20 సమ్మిట్‌లో పాల్గొనేందుకు వచ్చిన దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసాకు స్వాగతం పలికేందుకు ఢిల్లీ విమానాశ్రయంలో కళాకారులు సాంస్కృతిక నృత్యాన్ని ప్రదర్శించారు.

     


  • 08 Sep 2023 03:45 PM (IST)

    ఢిల్లీకి చేరుకున్న జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా

    జీ20 సదస్సు కోసం జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా ఢిల్లీకి చేరుకున్నారు.

     

     


  • 08 Sep 2023 03:42 PM (IST)

    ఢిల్లీ చేరుకున్న బ్రిటన్ ప్రధాని రిషి సునాక్

    దేశ రాజధానిలో జరగనున్న జీ20 సమ్మిట్‌లో పాల్గొనేందుకు బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్ శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్నారు. ఆయనకు భారత ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. ఈ నెల 9, 10 తేదీల్లో న్యూఢిల్లీలో జీ20 సదస్సు జరగనుంది. ఈ సదస్సులో ప్రపంచంలోని పలు దేశాధినేతలు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో 40 మంది ప్రపంచ చేశాలకు చెందిన ప్రతినిధులు, ఆయా దేశాల అధినేతలు పాల్గొనే అవకాశం ఉంది. ఈ సమావేశానికి కేంద్ర ప్రభుత్వం విస్తృతంగా ఏర్పాట్లు చేసింది.

     


  • 08 Sep 2023 03:00 PM (IST)

    ఢిల్లీకి చేరుకున్న పలు దేశాల నేతలు

    యూకే ప్రధాని రిషి సునాక్‌ కంటే ముందుగానే పలువురు దేశాల నేతలు ఢిల్లీకి చేరుకున్నారు. యూనియన్ ఆఫ్ కొమొరోస్ ప్రెసిడెంట్, ఆఫ్రికన్ యూనియన్ (AU) ఛైర్మన్ అజాలి అసోమాని G20 సమ్మిట్ కోసం ఢిల్లీకి చేరుకున్నారు. రైల్వే, బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి రావుసాహెబ్ పాటిల్ దాన్వే ఆయనకు స్వాగతం పలికారు. జీ20 సమ్మిట్‌లో పాల్గొనేందుకు వచ్చిన ఇటలీ ప్రధాని జార్జియా మెలోనికి స్వాగతం పలికేందుకు ఢిల్లీ విమానాశ్రయంలో సాంస్కృతిక నృత్యాన్ని ప్రదర్శించారు. అర్జెంటీనా అధ్యక్షుడు అల్బెర్టో ఫెర్నాండెజ్ pr20 సమ్మిట్ కోసం ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఉక్కు గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం అల్బెర్టో ఫెర్నాండెజ్ ఢిల్లీలోని ఏరోసిటీలోని ఓ హోటల్‌కు చేరుకున్నారు

    భారత్‌ అధ్యక్షతన జరగనున్న జీ-20 సదస్సు కు హాజరయ్యేందుకు అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ క్రిస్టాలినా జార్జివా ఢిల్లీకి విచ్చేశారు. గురువారం రాత్రి దేశ రాజధానికి చేరుకున్న ఆమెకు భారత అధికారులు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమెను ఆహ్వానించేందుకు దిల్లీ ఎయిర్‌పోర్టు లో ప్రత్యేక సాంస్కృతిక నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఆ ప్రదర్శనను వీక్షించిన క్రిస్టాలినా కూడా సరదాగా కాలుకదిపారు.