ఏదైనా చెయ్యాలనే ఆలోచన ఉంటే సరిపోదు.. దానికోసం కష్టపడి సాధించాలి.. అందుకే అంటారు కల్లుమూసుకొని కలలు కంటే సరిపోదు.. అందుకు తగ్గట్లు కృషి కూడా చెయ్యాలి.. అప్పుడే అనుకున్న విజయాన్ని సాధిస్తారు.. ఈరోజుల్లో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్లు కూడా ఉన్నారు.. ఈమధ్య కాలంలో ఎక్కువ మంది ఆడవాళ్లు పలు వ్యాపారాలు చేస్తూ సక్సెస్ అయ్యారు.. ఇప్పుడు మనం వందనా లూద్రా గురించి వివరంగా తెలుసుకుందాం..
అందం, ఆరోగ్యం రంగంలో ఉన్న అన్ని అడ్డుకులను, ఇబ్బందులను అధిగమించింది వందన. అందుకే తన వ్యాపార జీవితంలో మంచి సక్సెస్ ను అందుకుంది. అది అప్పట్లో ఒక వినూత్న ఆలోచన. వందనా లూథ్రా కర్ల్స్ అండ్ కర్వ్స్ (వీఎల్సీసీ) అనే వెల్నెస్ సెంటర్ ను స్టార్ట్ చేసింది. దీన్ని కేవలం ఈమె రూ.20 వేల పెట్టుబడితో ప్రారంభించింది. అప్పటి నుంచి ఈ కంపెనీ రూ.2,225 కోట్లకు పెరిగింది.. ఈమె గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
వందనా 1956 లో జూలై 12 న ఢిల్లీలో జన్మించారు. ఈమె పలుకుబడి కలిగిన కుటుంబం నుంచి వచ్చారు. ఈమె తల్లి ఆయుర్వేద వైద్యురాలు. తండ్రి మెకానికల్ ఇంజనీర్. లూథ్రా న్యూఢిల్లీలోని పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ లో విద్యనభ్యసించింది.. తన చదువును పూర్తి చేసిన తర్వాత పలు దేశాలు తిరిగింది.. జర్మనీలో తన అధికారిక కాస్మెటాలజీ, న్యూట్రిషన్ అధ్యయనాలను పూర్తి చేసింది. అక్కడ ఆమె జీవనశైలి సంరక్షణ, పోషణ, ఫిట్నెస్, సౌందర్య పరిశ్రమలలో కూడా బాగా ప్రావీణ్యం పొందింది.. బ్యూటీ పరిశ్రమలను పెట్టాలను ఆమె భావించింది. ఆరోగ్యం, అందాన్ని జోడించడం ద్వారా శ్రేయస్సుకు పూర్తి విధానాన్ని ప్రోత్సహించే సంస్థను ప్రారంభించాలనుకుంది. తన భర్త సహకారం కూడా ఆమె తోడైంది.. రూ.20,000తో ఢిల్లీలోని వీఎల్సీసీ ఆరోగ్య కేంద్రం నిర్మాణాన్ని ప్రారంభించారు..
ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వీరి ఉత్పత్తులను ఎక్కువగా వాడుతున్నారు..చర్మ సంరక్షణ, అందానికి ప్రతీకగా వీరి ప్రొడక్ట్స్ నిలిచాయి. దక్షిణాసియా, ఆగ్నేయాసియా, తూర్పు ఆఫ్రికాలోని 139 నగరాలు, 12 దేశాల్లో ఈ బ్రాండ్ సేవలు అందిస్తోంది… మహిళలకు ఉపాధిని కూడా కల్పిస్తున్నారు..తన బ్రాండ్ లోని 3,000 మంది ఉద్యోగుల్లో డెబ్బై శాతానికి పైగా మహిళలే ఉన్నారు. వృత్తి కోసం ఆమె చేసిన కృషికి విశేషమైన ప్రశంసలు లభించాయి.. ఈమె చేస్తున్న సేవలకు గాను ఈమెకు పద్మశ్రీని కూడా ఇచ్చారు.. నిజంగా గ్రేట్ కదా..