Balagam: కమెడియన్ ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ జంటగా జబర్దస్త్ నటుడు వేణు ఎల్దండి దర్శకత్వం వహించిన చిత్రం బలగం. ఈ ఏడాది రిలీజ్ అయిన భారీ బ్లాక్ బాస్టర్ సినిమాల్లో బలగం.దిల్ రాజు కుమార్తె హర్షితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. ఒకటి చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అవార్డులను రివార్డులను అందుకొని ఇండస్ట్రీని షేక్ చేసింది. ప్రస్తుతం ఈ అవార్డుల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా బలగం గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటికే ఎన్నో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ లో అవార్డులు గెలుచుకున్న బలగం.. తాజాగా ఇంటర్నేషనల్ సౌండ్ అండ్ ఫిల్మ్ మ్యూజిక్ ఫెస్టివల్ లో బెస్ట్ ఒరిజినల్ స్కోర్ .. ఫీచర్ విభాగంలో ఎన్నికయింది.
Pushpa 2 :క్లైమాక్స్ విషయంలో కన్ఫ్యూజ్ అవుతున్న సుకుమార్..?
క్రొయేషియాలో జరిగే బిగ్గెస్ట్ మ్యూజికల్ ఫెస్టివల్ లో బలగం లాంటి చిన్న సినిమా.. ఎన్నికవ్వడం అత్యంత అరుదైన విషయమని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందించాడు. పల్లెటూరు యొక్క గొప్పతనాన్ని, బంధాలు బంధుత్వాలు యొక్క విశిష్టతను వేణు ఎంతో హృద్యంగా ఈ సినిమా ద్వారా తెలిపాడు. ఇక ఈ అవార్డుకు బలగం ఎన్నికవ్వడంపై చిత్ర బృందం మరోసారి ఆనందాన్ని వ్యక్తం చేశారు. మరి ఈ సినిమా అవార్డును గెలుచుకుంటుందేమో చూడాలి.