NTV ఎఫెక్ట్.. ఎమ్మిగనూరులో శిశువు మృతిపై విచారణ
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో బుధవారం ఓ ప్రైవేట్ వైద్యుడి నిర్వాకం వల్ల నెల రోజుల వయస్సున్న బాలుడు మృతి చెందాడు. బొడ్డు కింద చీము వస్తుందని చికిత్స కోసం తల్లిదండ్రులు ప్రైవేట్ దవాఖానకు తీసుకొచ్చారు. అయితే వైద్యుడు నిర్లక్ష్యంగా బొడ్డు కింద కోసేయడంతో బాలుడి పేగులు బయటపడ్డాయి. దీంతో ఆ వైద్యుడు పేగులను కడుపులో వేసి ప్లాస్టర్ వేశాడు. ఈ క్రమంలో బాలుడిని వెంటనే కర్నూలుకు తీసుకుపోవాలని వైద్యుడు చెప్పాడు. దీంతో వెంటనే కర్నూలులోని ఆస్పత్రికి బాలుడి తల్లిదండ్రులు తరలించారు. అక్కడి వైద్యులు బాలుడిని పరిశీలించగా.. అప్పటికే చనిపోయాడని తెలిపారు.
ఆఫ్రికాలో హిడింబ.. వేశ్యల పాలిట యముడిగా మారిన నరరూప రాక్షసుడు
ఆఫ్రికా దేశం రువాండాలో దారుణం జరిగింది. రువాండాలో ఒళ్లు గగుర్పొడిచే దారుణ మారణకాండ తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి ఏకంగా 14 మంది వేశ్యలను హత్య చేయడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. రువాండా రాజధాని కిగాలీలో ఓ నరరూప రాక్షసుడు వేశ్యలను లక్ష్యంగా చేసుకుని దారుణంగా హత్య చేశాడు. ఆ సీరియల్ కిల్లర్ ఓ అద్దె ఇంటిలో నివసిస్తున్నాడు. అతడి వయసు 34 సంవత్సరాలు. వేశ్యలను ఇంటికి పిలిపించుకుని వారిని హత్య చేసి, వారి నుంచి నగదు, ఫోన్లు, ఇతర వస్తువులు దోచుకునేవాడు. అనంతరం వారి మృతదేహాలను కిచెన్ లో ఓ గొయ్యి తీసి పాతిపెట్టేవాడు.
భయంకరమైన నిజాలను ప్రభుత్వం దాస్తుంది.. శ్వేత పత్రం విడుదల చేయాలి
వైసీపీ ప్రభుత్వంపై జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెనాలిలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల నుండి 3,82,000 మంది విద్యార్థులు డ్రాప్ ఔట్ అయ్యారని తెలిపారు. అంతేకాకుండా.. 42 లక్షల మందిలో 2వేల29 మంది విద్యార్థుల లెక్కలు తేలడం లేదంటున్నారు.. దీనిపై ఏం జరిగిందో ప్రభుత్వం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ఇది సర్వేల తప్పులా అని దుయ్యబట్టారు. గడిచిన మూడేళ్లలో ప్రభుత్వ పాఠశాలలో చదివే 18 సంవత్సరాల లోపు పిల్లలు 60 వేల మందికి పైగా మరణించారని నాదెండ్ల పేర్కొన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో అనేక మంది విద్యార్థులు చనిపోయారని సర్వేల్లో తేలిందని ఆయన తెలిపారు. రెండు లక్షల మంది విద్యార్థులు కనిపించడం లేదని తేలిందని చెప్పారు. భయంకరమైన నిజాలను ప్రభుత్వం దాస్తుందా అని ప్రశ్నించారు. దీనికి బాధ్యత సీఎం జగన్దేనని నాదెండ్ల మనోహర్ తెలిపారు.
WWE సూపర్ స్టార్ జాన్ సీన తో కార్తీ.. ఫోటో వైరల్
చిన్నప్పటి నుంచి గేమ్స్ ఆడనివారు ఉంటారేమో కానీ, టీవీలో WWE చూడని వారు ఉండరు. ముఖ్యంగా WWE కార్డు గేమ్స్ ఆడనివారైతే ఉండరేమో. ఇక అందులో WWE సూపర్ స్టార్ జాన్ సీన గురించి తెలియని వారుండరు. WWE కి ఆయనే మెగాస్టార్ .. సూపర్ స్టార్. ఇప్పుడు ఆయన గురించి ఎందుకు చెప్తున్నారు అంటే.. ఎన్నో ఏళ్ళ తరువాత జాన్ సీన్ ఇండియాలో అది హైదరాబాద్ లో సందడి చేశాడు. WWE సూపర్ స్టార్ స్పెక్టాకిల్ ఈవెంట్ ప్రారంభం కానున్న నేపథ్యంలోనే జాన్ సీన ఆ ఈవెంట్ కు అటెండ్ అయ్యాడు. ఇక దీంతో ఎయిర్ పోర్టులోనే జాన్ సీన లవర్స్ హంగామా చేశారు. చాలా ఏళ్ళ తరువాత ఆయన ఇండియాలో అడుగుపెట్టడంతో పూలమాలలు వేసి ఘనంగా స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
యువగళం కాదు గొడవల గళం.. టీడీపీపై విసుర్లు
టీడీపీ నేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలులో కొనసాగుతుంది. అయితే అంతకుముందు రాజోలులో టీడీపీ కార్యకర్తల ఫ్లెక్సీల పంచాయతీ తారాస్థాయికి చేరింది. రాజోలు మండలం తాటిపాకలో లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా ఒక వర్గం నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ఇంఛార్జి ఫొటో లేకపోవడంతో ఓ వర్గం వారు ఆగ్రహంతో ఆ ప్లెక్సీలు చించివేశారు. దీంతో ఆగ్రహించిన మరో వర్గం వారు వేసిన ప్లెక్సీలు చించివేయడంతో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునే స్థాయికి చేరింది.
ఇప్పటి వరకు వారి నుంచి ఎలాంటి సమాధానం లేదు..
తెలంగాణ హైకోర్టు తీర్పు మేరకు గద్వాల నియోజకవర్గం ఎమ్మెల్యేగా డీకే అరుణను పేర్కొంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఈనెల 4న నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో ఇవాళ డీకే అరుణ గవర్నర్ తమిళిసైని కలిశారు. అంతనంర డీకే అరుణ మీడియాతో మాట్లాడుతూ.. ఆగస్ట్ 24 హైకోర్టు తీర్పు ఇచ్చిందని, సెప్టెంబర్ 4 కేంద్ర ఎన్నికల సంఘం గెజిట్ విడుదల చేసిందన్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు చేయాలని రెండు సార్లు స్పీకర్, సెక్రటరీ లకు కలవడం జరిగిందని, అసెంబ్లీ స్పీకర్, సెక్రటరీ లు అందుబాటులో లేరని ఆమె వెల్లడించారు. ఇప్పటి వరకు వారి నుంచి ఎలాంటి సమాధానం లేదని, అసెంబ్లీ స్పీకర్ నుంచి రెస్పాన్స్ లేకపోవడం తో గవర్నర్ ను కలవడం జరిగిందని ఆమె వివరించారు. హైకోర్టు తీర్పు, కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన గెజిట్ , తెలంగాణ రాజ పత్రాన్ని గవర్నర్ కు అందజేయడం జరిగిందని ఆమె తెలిపారు. ఉద్దేశ పూర్వకంగానే స్పీకర్ వ్యవహరిస్తున్నారని, గవర్నర్ సానుకూలంగా స్పందించినట్లు ఆమె వెల్లడించారు. అసెంబ్లీ స్పీకర్ తో మాట్లాడుతానని గవర్నర్ చెప్పినట్లు, స్పీకర్ సమాధానం కోసం ఎదురు చూస్తున్నానని డీకే అరుణ తెలిపారు.
ఆ ప్రక్రియ పూర్తయితే ఇండియా పేరును భారత్‌గా మార్చడాన్ని అంగీకరిస్తాం!
న్యూ ఢిల్లీ అన్ని లాంఛనాలను పూర్తి చేసిన తర్వాత ఐక్యరాజ్యసమితి యూఎన్ రికార్డులలో ఇండియా పేరును భారత్‌గా మారుస్తుందని గ్లోబల్ బాడీ ప్రతినిధి ఈరోజు వెల్లడించారు. ఇండియా పేరు మార్చడానికి లాంఛనాలను పూర్తి చేసినప్పుడు వారు మాకు తెలియజేస్తారని.. ఆ సమయంలో యూఎన్ రికార్డుల్లోని పేరు మారుస్తామని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ప్రధాన ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ చెప్పారు.
జీ 20 దేశాధినేతలకు పంపిన ఆహ్వాన పత్రికల్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా స్థానంలో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ముద్రించడంతో దేశంలో చెలరేగిన రాజకీయ దుమారం కొనసాగుతుండగానే మరో వివాదం తెరపైకి వచ్చింది. తాజాగా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్ అని ముద్రించి ఉన్న ప్రకటనను విడుదల చేయడం తాజాగా మరో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే రానున్న ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో ఇండియా పేరును భారత్‌గా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందన్న ఊహాగానాలకు మరింత బలం చేకూర్చినట్లయింది.
దొంగతనం చేశానని తెలిసే చంద్రబాబు భయపడుతున్నాడు
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబుకి ఐటీ నోటీసులు ఇచ్చారు.. అవంటే ఎందుకు అంత భయమని అన్నారు. దొంగ తనం చేశానని తెలిసే చంద్రబాబు భయపడుతున్నాడని మంత్రి ఆరోపించారు. నోటీసులు ఇచ్చిన అధికారులను చంద్రబాబు ఎదురు ప్రశ్నిస్తున్నాడని దుయ్యబట్టారు. చంద్రబాబు ముడుపులు తీసుకున్న మాట నిజం అని అధికారులు నిర్ధారించుకున్న తర్వాత అధికారులు నోటీసులు ఇచ్చి ఉంటారని అంబటి పేర్కొన్నారు.
ఏకకాలంలో 9 జిల్లాల్లో మెడికల్ కాలేజీల ప్రారంభం
15న జరిగే మెడికల్ కాలేజీల ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలన్నారు మంత్రి కేటీఆర్. 15వ తేదీన ఏకకాలంలో 9 జిల్లాల్లో మెడికల్ కాలేజీ ల ప్రారంభంపై ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలతో మంత్రి కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. 15వ తేదీన జరిగే మెడికల్ కాలేజీ ల ప్రారంభోత్సవం సందర్భంగా ఆయా జిల్లా కేంద్రాల్లో భారీ ర్యాలీలు నిర్వహించాలని సూచించారు. 20,000 మందికి తగ్గకుండా ర్యాలీ నిర్వహించాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు ఆదేశించారు. దేశంలో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీలు ఉన్న రాష్ట్రంగా తెలంగాణ అని, 50 ఏళ్ల కాంగ్రెస్ జమానాలో తెలంగాణకు దక్కింది కేవలం రెండు మెడికల్ కాలేజీలే అని ఆయన అన్నారు. 157 మెడికల్ కాలేజీలు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చింది శూన్యమని ఆయన మండిపడ్డారు. తెలంగాణ ఆహార ఉత్పత్తిలోనే కాదు దేశ ఆరోగ్యానికి కీలకమైన డాక్టర్ల ఉత్పత్తిలోనూ అగ్ర స్థానంలో ఉందని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.
చంద్రబాబు చంద్ర మండలం మీదకు వెళ్లిన అరెస్ట్ చేసి తీరుతాం
చంద్రబాబు ఐటీ కేసులపై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందిస్తూ.. తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ.. దొంగ పనులు చేసిన చంద్రబాబును ఎందుకు అరెస్ట్ చేయకూడదని ప్రశ్నించారు. చంద్రబాబు చంద్ర మండలం మీదకు వెళ్లిన అరెస్ట్ చేసి తీరుతామని విమర్శలు చేశారు. రూ. 118 కోట్ల లంచాల కేసులో తన పీఏ శ్రీనివాస్ ను, బ్రోకర్ మనోజ్, వాస్ దేవ్, పార్థసారథిలను చంద్రబాబు దేశం దాటించి, పారి పోయేలా చేశాడన్నారు. తప్పు చేయనప్పుడు వారిని ఎందుకు దేశం దాటించారని మంత్రి అన్నారు. ఒకరు అమెరికా, మరొకరు దుబాయ్ పారిపోవడానికి కారణం ఏంటని ప్రశ్నించారు.
యూకేలో ఖలిస్తానీ తీవ్రవాదాన్ని సహించను.. హిందువుగా గర్విస్తున్నా..
జీ-20 శిఖరాగ్ర సమావేశానికి భారత రాజధాని ఢిల్లీ పూర్తిగా సిద్ధమైంది. కాగా, శనివారం నుంచి ప్రారంభమయ్యే జీ-20 సదస్సు కోసం బ్రిటన్ ప్రధాని రిషి సునక్ న్యూఢిల్లీ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన భారత్‌కు రావడంపై సంతోషం వ్యక్తం చేశారు. రిషి సునాక్ భారతదేశంతో సంబంధాలు, ఉచిత వాణిజ్య ఒప్పందం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో సహా అనేక అంశాలపై విస్తృతంగా మాట్లాడారు. జీ-20 సమ్మిట్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి భారతదేశం సరైన దేశమని ఆయన అభివర్ణించారు. ఆయన తనను తాను గర్వించదగిన హిందువుగా అభివర్ణించాడు. భారతదేశ పర్యటన సందర్భంగా ఒక ఆలయాన్ని సందర్శించడం గురించి మాట్లాడారు.రిషి సునక్ మాట్లాడుతూ “నేను గర్వించదగిన హిందువునని, నేను కూడా అలాగే పెరిగాను. రక్షా బంధన్ పండుగను కూడా జరుపుకున్నాను. రక్షా బంధన్ రోజు మా అక్కాచెల్లెళ్లు నాకు రాఖీ కట్టారు. మొన్నటికి మొన్న జన్మాష్టమిని సక్రమంగా జరుపుకునే సమయం లేకున్నా, గుడికి వెళ్లి దర్శనం చేసుకుని సరిపెట్టుకుంటాను.” అని ఆయన తెలిపారు.
బిగ్ బ్రేకింగ్.. చంద్రముఖి 2 వాయిదా..
రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ జంటగా పి. వాసు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం చంద్రముఖి 2. దాదాపు 13 ఏళ్ళ క్రితం రజనీకాంత్, జ్యోతిక, ప్రభు కీలక పాత్రల్లో నటించిన చంద్రముఖికి ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా వినాయకచవితి సందర్భంగా సెప్టెంబర్ 15 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ఎప్పుడైతే అనౌన్స్ చేసారో అప్పటినుంచి మంచి హైప్ తెచ్చుకుంది. బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ కావడం ఒకటి అయితే .. కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ చంద్రముఖిగా నటించడం మరొక హైలైట్ గా నిలిచింది. ఇప్పటికే.. చంద్రముఖి పాత్రలో కంగనా పోస్టర్స్ ప్రేక్షకులను ఓ రేంజ్ లో మెప్పించాయి. అందులోనూ హర్రర్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ రాఘవ లారెన్స్ సినిమా కావడంతో అభిమానులు మరింతగా ఎదురుచూస్తున్నారు.
త్రిపుర, ఉత్తరాఖండ్‌లో బీజేపీ.. కేరళలో కాంగ్రెస్, బెంగాల్‌లో తృణమూల్ గెలుపు
సెప్టెంబర్ 5వ తేదీన ఉప ఎన్నికలు జరిగిన ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఓట్ల లెక్కింపు శుక్రవారం ఆయా రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో చేపట్టారు. త్రిపురలో బీజేపీకి చెందిన బిందు దేబ్‌నాథ్ సీపీఎం అభ్యర్థి కౌశిక్ చందాను 18,000 ఓట్లకు పైగా ఓడించగా, కేరళలో కాంగ్రెస్‌కు చెందిన చాందీ ఒమెన్ 36,000 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఆరు రౌండ్ల ఓట్ల లెక్కింపు తర్వాత బిందు దేబ్‌నాథ్‌కు మొత్తం 30,017 ఓట్లు వచ్చాయని ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ ఏడాది చివర్లో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, 2024లో కీలకమైన లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏకు వ్యతిరేకంగా ఇండియా కూటమికి ఈ ఉప ఎన్నికల ఫలితాలు ఒక పరీక్షగా పరిగణించబడుతున్నాయి.