Leading News Portal in Telugu

Pushpa 2 :క్లైమాక్స్ విషయంలో కన్ఫ్యూజ్ అవుతున్న సుకుమార్..?


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వం లో రూపొందిన పుష్ప మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమా తో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారారు. అంతే కాదు రీసెంట్ గా ప్రకటించిన 69 వ జాతీయ చలన చిత్ర అవార్డు లలో ఉత్తమ నటుడుగా అల్లు అర్జున్ అవార్డు అందుకున్నాడు. అలాగే ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ కు కూడా అవార్డు లభించింది.పుష్ప సినిమా భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేయడంతో పుష్ప 2 సినిమా పై భారీగా అంచనాలు పెరిగిపోయాయి.. అందుకే పుష్ప 2 మూవీ కచ్చితంగా గ్లోబల్ వైడ్ గా భారీ విజయం సాధిస్తుందని చిత్ర యూనిట్ ఎంతో నమ్మకంగా వుంది.ఈ సినిమా కోసం దాదాపుగా ఏడాది పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరిగింది. కథ విషయం లో ఎంతో క్లారిటీగా ఉండే సుకుమార్‌ పుష్ప 2 విషయం లో చాలా మార్పులు చేర్పులు చేయడం తో పాటు చాలా వర్షన్ లలో క్లైమాక్స్ ను కూడా రాసుకున్నారని సమాచారం.

ప్రస్తుతం సుకుమార్‌ క్లైమాక్స్ విషయం లో కాస్త కన్ఫ్యూజన్ లో ఉన్నట్లు సోషల్ మీడియాలో న్యూస్ తెగ వైరల్ అవుతుంది.అంతే కాకుండా ఈ సినిమా ను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని ఫ్యాన్స్ కూడా ఒత్తిడి తీసుకొస్తున్నట్లు సమాచారం.. కానీ ఆ టైం లో చిత్రం విడుదల సాధ్యం కాదు అంటూ చాలా మంది చెప్పుకొస్తున్నారు.. సుకుమార్‌ చిత్రం విడుదల విషయం లో ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. అంతే కాకుండా సమ్మర్ వరకు వెయిట్‌ చేస్తే అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశాలు కూడా చాలానే ఉన్నాయి.దీనితో సినిమా షూటింగ్ ను డిసెంబర్‌ నెల కల్లా పూర్తి చేసే పనిలో వుంది చిత్ర యూనిట్.. షూటింగ్‌ కోసం అల్లు అర్జున్‌ పూర్తి డేట్లు కేటాయించారు.. అందుకే సుకుమార్‌ కాస్త త్వరగా ఈ సినిమాను ముగించాలని భావిస్తున్నట్లు సమాచారం.. పుష్ప సినిమాకు జాతీయ అవార్డు రావడంతో పుష్ప 2 సినిమాకు బిజినెస్ భారీ స్థాయిలో జరుగుతున్నట్లు తెలుస్తుంది.