Leading News Portal in Telugu

TET Hall Tickets: తెలంగాణ టెట్‌ అభ్యర్థులకు అలర్ట్‌.. ఈ రోజే హాల్‌టికెట్లు విడుదల


TET Hall Tickets: తెలంగాణలో ఆగస్టు 1న టీఎస్ టెట్ 2023 నోటిఫికేషన్ (టీఎస్ టెట్ 2023) విడుదలైన సంగతి తెలిసిందే. ఈ తెలంగాణ టెట్‌కు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ఆగస్టు 2 నుంచి ప్రారంభం కాగా, దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 16తో ముగిసింది. దరఖాస్తు గడువు ముగిసే సమయానికి మొత్తం 2,83,620 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. సెప్టెంబర్ 15న పరీక్ష నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో..టీఎస్ టెట్ హాల్ టికెట్ 2023 సెప్టెంబర్ 9న అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల కానున్నాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https: //tstet.cgg.gov.in/ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేసి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. టెట్ పరీక్ష (టీఎస్ టెట్ 2023) సెప్టెంబర్ 15న ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 నిర్వహించనున్నారు. అనంతరం సెప్టెంబర్ 27న ఫలితాలు విడుదల చేస్తామని అధికారులు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.టెట్‌కు సంబంధించి గత నోటిఫికేషన్‌తో పోలిస్తే ఈసారి దరఖాస్తులు తగ్గాయి. గతంలో 4 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అయితే.. ఈసారి అందులో సగం మాత్రమే రావడం గమనార్హం. అభ్యర్థులంతా గురుకుల పరీక్షపైనే దృష్టి కేంద్రీకరించడంతో టెట్ కు దరఖాస్తులు తగ్గినట్లు తెలుస్తోంది.

Read also: G-20 Summit: జీ-20 సదస్సులో కరీంనగర్ కళాకారుల నైపుణ్యం.. సమ్మిట్‌లో స్టాల్ నిర్వహణకు కూడా అనుమతి

డీఎస్సీ (టీఎస్ డీఎస్సీ)లో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఇస్తారు కాబట్టి టెట్ స్కోర్‌కే ప్రాధాన్యం ఇస్తారు. టెట్ ఉత్తీర్ణత సర్టిఫికెట్ చెల్లుబాటు ఏడేళ్లు మాత్రమే కాగా, గతేడాది ఎన్‌సీటీఈ జీవితకాలం చెల్లుబాటవుతుందని ప్రకటించింది. ఒక్కసారి ఉత్తీర్ణత సాధిస్తే జీవితకాలం చెల్లుతుందన్న ధీమాతో అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. మొత్తం 150 మార్కులకు.. చైల్డ్ డెవలప్ మెంట్ 30 మార్కులు, జనరల్ తెలుగు (3 నుంచి 10వ తరగతి వరకు) 30 మార్కులు, ఇంగ్లిష్ 30 మార్కులకు వ్యాకరణం, వ్యాకరణంపై దృష్టి పెట్టాలి. మిగిలిన 60 మార్కులు చాలా ముఖ్యం..తెలుగు మెథడాలజీ 12 మార్కులు, మిగిలిన 48 మార్కులు తెలుగు సాహిత్యం, ఆధునిక పోకడ, పాఠ్యపుస్తకాల్లో అన్నీ సిద్ధం చేసుకోవాలి.
Salaar: కనీసం సమాధానం చెప్పే తీరిక కూడా లేకుండా పోయింది…