Sajjala Ramakrishna Reddy: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసి విజయవాడకు తరలిస్తున్నారు సీఐడీ అధికారులు.. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో ఆయన్ని అరెస్ట్ చేసిన విషయం విదితమే కాగా.. తాడేపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సజ్జల మాట్లాడుతూ.. చంద్రబాబు అరెస్టులో అసలు విషయం పక్కకు వెళ్లేలా టీడీపీ నేతలు గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు.. చంద్రబాబు అరెస్ట్‌లో ఎలాంటి దురుద్దేశాలు లేవు.. బలమైన ఆధారాలతోనే సిట్ వేశాం.. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఎంతో సంయమనంతో ఉందన్నారు.. దర్యాప్తు సంస్థలు ఎంతో స్వేచ్చగా దర్యాప్తు చేస్తున్నాయన్న ఆయన.. స్వాతంత్ర్య భారత దేశంలో అత్యంత హేయమైనది ఆర్ధిక నేరం.. స్కీమ్ పేరుతో స్కామ్ చేశారని విమర్శించారు.
ఆర్ధిక నేరాల్లో నోటీసు ఇవ్వాల్సి అవసరం లేదన్నారు సజ్జల.. ఎఫ్ఐఆర్ లో పేరు లేదని చంద్రబాబు ఎవరిని దబాయిస్తున్నాడు? అని మండిపడ్డారు.. ఈ స్కామ్ లో చంద్రబాబు పాత్ర ఉందన్నది అందరికీ తెలిసిన విషయమేనన్న ఆయన.. వ్యక్తిగతం కక్ష సాధింపుకు వెళ్లని స్వభావం సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డిది అన్నారు.. దర్యాప్తులో తేలాలి రాజకీయ ప్రమేయం ఉండకూడదనే రెండేళ్లు ఆగారని.. దబాయించి బయట పడాలని చూస్తే ఇంకా సాధ్యం కాదని హెచ్చరించారు సజ్జల రామకృష్ణారెడ్డి.. తాడేపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైసీపీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియో క్లిక్ చేయండి..