Leading News Portal in Telugu

Mouth Ulcer: నోటిలో పుండ్లు వస్తున్నాయా? ఈ చిట్కాలు పాటించండి


Mouth Ulcer Reasons and Remedies : చాలా మందికి నోటిలో పుండ్లు (మౌత్ అల్సర్లు) రావడం తరుచుగా జరుగుతూ ఉంటుంది. ఇవి చాలా నొప్పిని కలిగిస్తాయి. ఆ సమయంలో ఏం తినాలన్నా తాగాలన్నా బాధగా ఉంటుంది.  నోటి శుభ్రత పాటించకపోవడం, మానసిక ఒత్తిడి పెరిగినా, విటమిన్ల లోపం తలెత్తినా నోటి పుండ్లు వేధిస్తాయి. అయితే ఒంటిలో వేడి పెరిగినా కూడా నోటిలో అల్సర్లు ఏర్పడతాయని అంటూ ఉంటారు. అయితే ఇవి సాధారణంగా రెండు వారాల వరకు ఉంటాయి. అయినా తగ్గకపోతే డాక్టర్ ను సంప్రదించడం మంచిది.

నోటి పుండ్లకు వంటింటి చిట్కాలతో కూడా చెక్ పెట్టవచ్చు.  తుల‌సి మొక్కలో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉన్నాయి. రోజులో నాలుగైదుసార్లు తుల‌సి ఆకులు న‌మ‌ల‌డం ద్వారా నోటి అల్సర్లను నివారించవచ్చు. ఇక ఉల్లిగడ్డలు కూడా ఈ నోటి పుండ్లను నివారించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఉల్లిగ‌డ్డలోని స‌ల్ఫర్ గుణాలు వీటిని తగ్గించడంలో ఉపయోగపడతాయి. అల్సర్ దగ్గర చిన్న ముక్క ఉంచినా లేదా ఉల్లి రసం తీసుకొని నోరు పుక్కిలించుకున్న ఉపశమనం లభిస్తుంది. ఇక నోటి పుండ్లకు విటమిన్ బీ12 లోపం కూడా ఓ కారణం. కాబట్టి ఈ విటమిన్ కు సంబంధించిన ఆహారం తీసుకున్న, టాబ్లెట్లు తీసుకున్న తొందరగా ఉపశమనం పొందవచ్చు. అయితే టాబ్లెట్ లు వాడే ముందు డాక్టర్ ను సంప్రదిస్తే మంచిది. ఇక తేనె కూడా వీటి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అల్సర్లు వచ్చినప్పుడు నోటిని తేమగా ఉంచుకోవడం అవసరం. తేనె తీసుకుంటే నోరు తేమగా ఉంటుంది. అంతేకాకుండా తేనెలో ఉండే యాంటీమైక్రోబ‌యాల్ ఈ పుండ్లకు కారణమయిన బ్యాక్టీరియాను తగ్గిస్తాయి. ఇక ఐస్ ముక్కలతో మసాజ్ చేసిన ఈ సమస్య తగ్గుతుంది. ఈ అల్సర్లు మండుతున్నా, నొప్పి ఎక్కువగా ఉన్నా ఆ ప్రదేశంలో కొబ్బరి నూనె రాస్తే తక్షణ ఉపశమనం లభిస్తుంది. కొబ్బరి నూనెను గాయాలు మాన్పడంలో ఎంత చక్కగా పని చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.