High Tension: విజయవాడలో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. శాంతి భద్రతల సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. చంద్రబాబును కలిసేందుకు పవన్‌కు అనుమతి లేదని పోలీసు వర్గాలు అంటున్నాయి. చంద్రబాబు కుటుంబ సభ్యులకు తప్ప మరెవ్వరికీ అనుమతి లేదని చెబుతున్నారు. భువనేశ్వరి, లోకేశ్‌లకు మాత్రమే అనుమతి ఇస్తామని పేర్కొన్నారు. ఉద్రిక్తతల కోసం పవన్ వస్తున్నారని తమకు సమాచారం ఉందని పోలీసు వర్గాలు అంటున్నాయి. ఈ మేరకు ఎయిర్పోర్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. పవన్ ప్రత్యేక విమానాన్ని అనుమతించి వద్దని ఎయిర్‌పోర్టు అధికారులకు సమాచారం పంపారు పోలీసులు.
ఈ నేపథ్యంలో గన్నవరం ఎయిర్ పోర్టు దగ్గర పోలీస్ బలగాలు భారీగా మోహరించాయి. కాసేపట్లో గన్నవరం విమానాశ్రయంకు పవన్ కళ్యాణ్ చేరుకోనున్నారు. అయితే పవన్ ను బయటకు వెళ్ళకుండా ఆపేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. అటు ఎయిర్ పోర్ట్ దగ్గర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పోలీసులు అడ్డుకున్నారు. పవన్ కళ్యాణ్ రిసీవ్ చేసుకోవడానికి వెళ్లిన మనోహర్.. విమానాశ్రయంలోకి ప్రవేశించేందుకు పోలీసులు నిరాకరించారు. అంతేకాకుండా..
ఎయిర్ పోర్ట్ లోపలకి వెళ్ళే ప్రతి వాహనం చెక్ చేసి పంపుతున్నారు పోలీసులు. మరోవైపు మీడియాను కూడా ఎయిర్ పోర్ట్ గేట్ దగ్గరే ఆపేస్తున్నారు. ఈ క్రమంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ విజయవాడకు వస్తుండటంతో మరింత హైటెన్షన్ వాతావరణం నెలకొంది.