Leading News Portal in Telugu

Sitara : సీతూ పాప పింక్‌ డ్రెస్‌లో బార్బీ డాల్‌లా మెరుస్తూ ఎంత ముద్దుగా ఉందో చూశారా?


తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి అందరికి తెలిసిందే.. ఆయన ఫ్యామిలీ గురించి అందరికి తెలుసు.. మహేష్ కూతురు సితార సినిమాల్లోకి రాకముందే స్టార్ ఇమేజ్ ను అందుకుంది.. మరోవైపు స్టార్‌ హీరోయిన్ల మాదిరిగా సోషల్‌ మీడియాలోనూ విపరీతమైన ఫాలోయింగ్‌ని సొంతం చేసుకుంది.. తన గురించి ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది..

చిన్నప్పుడు సెన్సేషన్‌గా మారిపోతుంది. ఆమె వార్తల్లో హెడ్‌లైన్‌గా మారుతుంది. ఎవరికీ సాధ్యం కాని విధంగా తాను అరుదైన స్టార్‌ కిడ్‌గా నిలుస్తుంది. తన క్రేజీ చేష్టలతో వాహ్‌ అనిపిస్తుంది. ఆ మధ్య టైమ్‌ స్వ్కైర్‌పై ప్రదర్శించబడి సంచలనంగా మారింది.. ప్రముఖ నగల సంస్థ తమ బ్రాండ్‌ ప్రమోషన్స్ లో భాగంగా సితారని తమ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంచుకున్న విషయం తెలిసింది. ఆమె నగలను ధరించగా షూట్‌ చేసిన యాడ్‌ వీడియోని టైమ్‌ స్వ్కైర్‌పై ప్రదర్శించారు.. తొలి స్టార్ కిడ్ గా అందరిని ఆకట్టుకుంది..

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ తన క్యూట్ నెస్ తో అందరిని తెగ ఆకట్టుకుంటుంది.. తాజాగా సితార లేత పింక్ కలర్‌ డ్రెస్‌ ధరించింది. లేత గులాబీలా వెలిగిపోతూ కనువిందు చేస్తుంది. చిలిపి స్మైల్‌తో మరింత అలరిస్తుంది. ఇందులో సితార క్యూట్‌నెస్‌ మరింతగా పెరిగింది. క్యూట్‌ నెస్‌ ఓవర్ లోడ్ అనేలా ఉంది.. సితూ పాప అన్నింటిలోనూ చురుకుగా ఉంటుంది. స్టడీస్‌లో ముందే ఉంటుంది. కల్చరల్‌ యాక్టివిటీస్‌లోనూ ముందే ఉంటుంది. డ్రాయింగ్స్ వేస్తుంది. గేమ్స్, తోపాటు యూట్యూబ్‌ వీడియోలు కూడా చేస్తుంది. ఇలా చైల్డ్ స్టార్‌గా పాపులర్‌ అవుతుంది. దీనికితోడు ఆ మధ్య ఓ హాలీవుడ్‌ చిత్రంలో చిన్నారికి వాయిస్‌ ఓవర్‌ ఇచ్చింది… సినిమాల్లో చెయ్యడం తనకిష్టం అని ఎన్నోసార్లు చెప్పింది.. అయితే త్వరలోనే టాలివుడ్ లోకి ఇవ్వనుందని సమాచారం..