Leading News Portal in Telugu

7.11 PM : ఓటీటీ లోకి వచ్చేసిన టైం ట్రావెల్ థ్రిల్లర్..


తెలుగులో టైం ట్రావెల్ స్టోరీతో చాలా సినిమాలే వచ్చాయి. బాలయ్య ఆదిత్య 369 తో టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో బ్లాక్ బస్టర్ విజయం సాధించాడు. ఆ సినిమా ఎవర్ గ్రీన్ మూవీ గా నిలిచిపోయింది. ఆ తరువాత తెలుగులో టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో కొన్ని సినిమాలు తెరకెక్కాయి.సూర్య 24, ప్రశాంత్ వర్మ అ!, శర్వానంద్‌ ఒకే ఒక జీవితం అలాగే రీసెంట్ గా బ్లాక్ బస్టర్ విజయం సాధించిన కల్యాణ్‌ రామ్‌ బింబిసార వంటి టైమ్‌ ట్రావెల్‌ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి..అలా టైమ్‌ ట్రావెల్‌కు కాస్త సైన్స్‌ ఫిక్షన్‌ను జోడించి తెరకెక్కిన చిత్రం 7:11 PM. డైరెక్టర్‌ చైతు మాదాల తెరకెక్కించిన ఈ సినిమాలో సాహస్, దీపిక హీరో, హీరోయిన్లుగా నటించారు. డాక్టర్ భరత్ రెడ్డి, టెస్ వాల్ష్, రఘు కారుమంచి, చరణ్ కురుగొండ, రైజింగ్ రాజు తదితరులు 7:11 PM లో ముఖ్య పాత్రలు పోషించారు.ఆర్కస్ ఫిల్మ్స్ బ్యానర్‍పై నరేన్ యనమదల, మాధురి రావిపాటి, వాణి కన్నెగంటి ఈ సినిమాను నిర్మించారు. గ్యాని ఈ సినిమాకు సంగీతం అందించారు…

మైత్రీ డిస్ట్రిబ్యూటర్స్‌ ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేశారు.ఈ సినిమా జూలై 7న థియేటర్లలో విడుదలైంది. అయితే ప్రేక్షకులని అంతగా ఆకట్టుకోలేదు.సినిమా కాన్సెప్ట్‌ బాగానే వున్నా సినిమాకు ప్రమోషన్లు పెద్దగా లేకపోవడంతో ప్రేక్షకుల నుంచి మిక్స్‌డ్‌ రెస్పాన్స్‌ వచ్చింది.అయతే ప్రముఖ మూవీ రివ్యూ వెబ్‌ సైట్‌ IMDB 7:11 PM సినిమాకు ఏకంగా 7.5 రేటింగ్‌ ను ఇచ్చింది.. థియేటర్లలో అంతగా ఆకట్టుకోలేక పోయిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్ వీడియోలో 7:11 PM సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.అయితే రీసెంట్ గా తెలుగులో కొన్ని సినిమాలు థియేటర్లలో పెద్దగా హిట్‌ కాకపోయినా ఓటీటీలో మాత్రం సూపర్‌ రెస్పాన్స్‌ తెచ్చుకుంటున్నాయి టైమ్‌ ట్రావెల్‌ అండ్‌ సైన్స్‌ ఫిక్షన్‌ మూవీ గా తెరకెక్కిన ఈ సినిమా  ఓటీటీ ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి..