
ఆసియా కప్‌లో మరోసారి భారత్, పాకిస్తాన్ మధ్య పోరుకు సమయం ఆసన్నమైంది. సూపర్-4 దశలో భాగంగా శ్రీలంకలోని ప్రేమదాస స్టేడియంలో నేడు ( ఆదివారం ) జరిగే సమరంలో ఇరు జట్లు తలపడనున్నాయి. అయితే, ఈ నెల 2న భారత్, పాక్ తలపడిన మ్యాచ్ వర్షం కారణంగా ఆగిపోయింది. దీంతో అభిమానుల ఆసక్తి, ప్రసారకర్తల విజ్ఞప్తిని దృష్టిలో ఉంచుకొని ఇవాళ్టి మ్యాచ్ కు ‘రిజర్వ్ డే’ను ప్రకటించారు. అయితే, నేడు (ఆదివారం) మ్యాచ్ జరిగే నగరంలో 90 శాతం వర్షసూచన ఉండటంతో రేపు కూడా ఇదే పరిస్థితి దాదాపు నెలకొంది. ఈ నేపథ్యంలో వాన అంతరాయం లేకుండా మ్యాచ్‌లో ఫలితం వస్తుందా అనేది ఆసక్తిరేపుతుంది.
Read Also: SBI Scheme : ఎస్బీఐ అద్భుతమైన స్కీమ్.. ఒకేసారి చేతికి రూ.18 లక్షలు..ఎలాగంటే?
ఇక, పాకిస్తాన్‌తో జరిగిన తొలి పోరులో భారత బ్యాటింగ్ లో చూడొచ్చు. 66 పరుగులకే టాప్–4 వెనుదిరిగారు. హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్ ఆదుకోవడంతో జట్టు కాస్త చెప్పుకోదగ్గ స్కోరు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో ఇండియా బ్యాటింగ్ మరింత మెరుగైన ప్రదర్శన చేయాల్సి ఉంది. నేపాల్‌తో జరిగిన గత మ్యాచ్‌తో పోలిస్తే టీమ్‌లో రెండు మార్పులు చేసే ఛాన్స్ ఉంది. వ్యక్తిగత కారణాలతో గత మ్యాచ్ కి దూరంగా ఉన్న జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టుతో చేరాడు. దాంతో షమీ స్థానంలో అతను ఆడటం ఖాయమైంది. బ్యాటింగ్ విభాగంలో ఇప్పుడు అందరి దృష్టి కేఎల్ రాహుల్‌పైనే ఉంది.
Read Also: Gold Price Today : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. పసిడి ధరలకు బ్రేక్.. తులం ఎంతంటే?
ఈ సంవత్సరం మార్చి తర్వాత కేఏ రాహుల్ ఒక్క వన్డే మ్యాచ్ ఆడలేదు. గాయం నుంచి కోలుకున్న తర్వాత ఇప్పుడు అతని బ్యాటింగ్‌తో పాటు ఫిట్నెస్ ప్రదర్శన కూడా కీలకంగా మారింది. తుది జట్టులో ఇషాన్ కిషన్ స్థానంలో అతను టీమ్ లోకి వస్తాడు. తాను ఆడిన గత నాలుగు వన్డేల్లో నాలుగు హాఫ్ సెంచరీలు చేసినా.. మిడిలార్డర్లో రాహుల్ కోసం కిషన్‌ను పక్కన పెట్టక తప్పడం లేదు.
Read Also: Chandrababu Naidu Arrest: చంద్రబాబుకు తెల్లవారుజామున 4 గంటలకు వైద్య పరీక్షలు.. మరికాసేపట్లో.. !
టీమిండియా సారథి రోహిత్, గిల్, కోహ్లి ఈ సారైనా టీమ్ స్కోరుకు మంచి పునాది వేయాల్సిన పరిస్థితి ఉంది. పాక్‌తో మ్యాచ్‌లో విఫలమైన శ్రేయస్ కూడా తన ఫామ్‌ను నిరూపించుకోవాల్సిందే. బౌలింగ్ విభాగం బుమ్రా, సిరాజ్, జడేజా, కుల్దీప్లతో పటిష్టంగా కనిపిస్తుంది. ఆల్‌రౌండర్‌గా శార్దుల్‌కు ఇది మరో కీలక ఛాన్స్. ఇక పాకిస్తాన్ పేస్ బౌలింగ్ త్రయం షాహిన్, రవూఫ్, నసీమ్ ఇప్పుడు ప్రపంచ క్రికెట్లో పటిష్టమైన బౌలింగ్ విభాగంగా కనిపిస్తోంది. తొలి మ్యాచ్‌లో భారత్‌ను ఈ ముగ్గురూ బాగా ఇబ్బంది పెట్టారు. వారు అదే జోరు కొనసాగించి తమ జట్టును ముందంజలో నిలపాలని పాక్ బోర్డు కోరుకుంటోంది.
Read Also: G20 Summit 2023: చైనా సిల్క్ రూట్ కట్.. ఇండియా నుంచి యూరప్ వరకు స్పైస్ రూట్
ఇక, ఇతర మ్యాచ్‌లను బట్టి చూస్తే ఓపెనర్లు ఇమామ్, ఫఖర్‌లతో పాటు మూడో స్థానంలో పాక్ సారథి బాబర్ బ్యాటింగే జట్టు గెలుపోటములలో కీలక పాత్ర పోషించనున్నాయి. మిడిలార్డర్లో రిజ్వాన్, సల్మాన్, ఇఫ్తికార్ మెరుగైన ప్రదర్శన ఇచ్చే ఛాన్స్ ఉంది. భారత్‌తో ఆడిన గత మ్యాచ్‌తో పోలిస్తే ఈ సారి పాక్ టీమ్‌లో ఒక మార్పు చేసింది. లెఫ్టార్మ్ స్పిన్నర్ నవాజ్ స్థానంలో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ఫహీమ్కు టీమ్ లోకి తీసుకునే ఛాన్స్ ఉంది.