Chandrababu Arrested Live Updates: నారా చంద్రబాబు రిమాండ్‌పై ఓపెన్ కోర్టులో విచారణ చేపట్టారు.. 409 సెక్షన్ కింద వాదనలు వినిపిస్తున్నారు. 409 సెక్షన్ పెట్టడం సబబు కాదంటున్న చంద్రబాబు లాయర్ సిద్ధార్థ్ లూథ్రా.. 409 పెట్టాలంటే ముందుగా సరైన సాక్ష్యం చూపాలంటున్న లూథ్రా.. రిమాండ్ రిపోర్ట్‌ను తిరస్కరించాలని లూథ్రా నోటీసులు జారీ చేశారు. తిరస్కరణపై న్యాయమూర్తి వాదనలకు అనుమతించారు. కేసులో తన వాదనలు వినాలని కోరిన చంద్రబాబు.. కోర్టులో చంద్రబాబు మాట్లాడుతున్నారు.
-
10 Sep 2023 12:27 PM (IST)
గవర్నర్ అనుమతిని సీఐడీ తీసుకోలేదు!
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు గవర్నర్ అనుమతి కావాలని, గవర్నర్ అనుమతిని సీఐడీ తీసుకోలేదని న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా విజయవాడ ఏసీబీ కోర్టులో పేర్కొన్నారు.
-
10 Sep 2023 12:15 PM (IST)
30 మందికి మించి ఉండకూడదు: జడ్జి
కోర్టు హాలులో 30 మందికి మించి ఉండకూడదని మరోసారి జడ్జి చెప్పారు. విచారణ హాలు నుంచి మిగతా వారిని బయటకు వెళ్లాలని జడ్జి కోరారు. 17ఏ సెక్షన్ గురించి సిద్ధార్థ్ లూథ్రా వివరిస్తున్నారు.
-
10 Sep 2023 11:59 AM (IST)
చంద్రబాబు లండన్ వెళ్లడం లేదు:
సీఐడీ ఆరోపిస్తున్నట్లు మాజీ సీఎం నా చంద్రబాబు లండన్ వెళ్లడం లేదని న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా ఏసీబీ కోర్టులో తెలిపారు. శనివారం ఉదయం 6 గంటలకు చంద్రబాబును అరెస్ట్ చేశామని సీఐడీ చెబుతోందని, ముందురోజు రాత్రి 11 గంటలకే ఆయనను సీఐడీ పోలీసులు చుట్టుముట్టారని పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం 10 నుంచి సీఐడీ అధికారుల ఫోన్ సంభాషణలను కోర్టుకు సమర్పించాలని కోరారు.
-
10 Sep 2023 11:38 AM (IST)
చంద్రబాబు కడిగిన ముత్యం లాగా బయటకు వస్తారు: కన్నా
మాజీ సీఎం నారా చంద్రబాబు అక్రమ అరెస్టుపై టీడీపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు. ‘స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ అంటూ వైసీపీ ప్రభుత్వం చంద్రబాబు మీద పెట్టిన అక్రమ కేసులు కోర్టులో నిలబడవు. 2021లో ఎఫ్‌ఐఆర్‌లో చంద్రబాబు పేరు లేదు. ఇప్పుడు రిమాండ్ రిపోర్టులో చంద్రబాబు పేరు చేర్చడం సరికాదు. ప్రజా కోర్టులో వైసీపీ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. చంద్రబాబు కడిగిన ముత్యం లాగా బయటకు వస్తారు’ అని కన్నా అన్నారు.
-
10 Sep 2023 11:26 AM (IST)
టీడీపీ నేత కొల్లు రవీంద్ర అరెస్ట్!
టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను ఆదివారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ.. రవీంద్ర శనివారం ఉదయం నుంచి పలు ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దాంతో ఆయనను గుణదల పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
-
10 Sep 2023 11:12 AM (IST)
కుప్పంలో టీడీపీ శ్రేణుల నిరాహార దీక్ష!
టీడీపీ అధినేత నారా చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ.. చిత్తూరు జిల్లా కుప్పం ఆర్టీసీ బస్టాండు వద్ద టీడీపీ శ్రేణులు నిరాహార దీక్ష చేపట్టాయి. నాలుగు మండలాల నాయకులు నిరాహార దీక్షలో కూర్చున్నారు.
-
10 Sep 2023 11:02 AM (IST)
విరామం అనంతరం మళ్లీ ప్రారంభమైన వాదనలు!
ఏసీబీ కోర్టులో తిరిగి ప్రారంభం అయిన స్కిల్ డెవలప్‌మెంట్ కేసు వాదనలు.. చంద్రబాబు తరఫున వాదనలు ప్రారంభించిన సిద్ధార్థ్ లూథ్రా.
-
10 Sep 2023 10:56 AM (IST)
చంద్రబాబు భార్య భువనేశ్వరికి సెన్స్ ఉందా?: మంత్రి రోజా
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌పై ఏపీ మంత్రి రోజా స్పందించారు. ‘మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును కారణాలు లేకుండా అరెస్ట్ చేయరు. ఆధారాలు లేకుండా అరెస్ట్ చేస్తే కేసు నిలబడదు. బోగస్ కంపెనీలు పెట్టి డబ్బులు అకౌంట్లోకి తెచ్చుకున్నారు. చట్టం ఎవరికైనా సమానమే. విచారణలో చాలా పేర్లు, అకౌంట్స్ బాయటికి వస్తాయి. లోకేష్, అతడి స్నేహితులు రియల్ ఎస్టేట్ చేస్తున్నది ముందే చెప్పాము. బాబు భార్య భువనేశ్వరికి సెన్స్ ఉందా?. తప్పు చేసిన భర్తను కాపాడాలని దేవుడిని వేడుకోవడం న్యాయమా?’ అని రోజా ప్రశ్నించారు.
-
10 Sep 2023 10:38 AM (IST)
ఏసీబీ కోర్టులో విచారణకు కాసేపు విరామం!
ఏసీబీ కోర్టులో స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు కేసు విచారణలో కాసేపు విరామం ప్రకటించారు. ఇప్పటివరకు వాదనలు వాడివేడిగా సాగాయి. 2021లో కేసు నమోదైతే ఇప్పటివరకు చంద్రబాబును ఎందుకు అరెస్ట్ చేయలేదని న్యాయమూర్త్తి ప్రశ్నించారు.
-
10 Sep 2023 09:52 AM (IST)
కోర్టులో వివరాలు తెలుపుతున్న ఏఏజీ!
సీఐడీ తరఫున ఏఏజీ పి. సుధాకర్ రెడ్డి వాదనలు ప్రారంభించారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన 24 గంటల్లోనే ప్రవేశపెట్టామని ఏఏజీ తెలిపింది. ప్రత్యేక సందర్భాల్లో ప్రయాణ సమయాన్ని మినహాయించవచ్చని.. A 35, మరో ఏడుగురిని సీఐడీ ఇప్పటికే అరెస్ట్ చేసిందని ఏఏజీ పేర్కొంది.
-
10 Sep 2023 09:27 AM (IST)
మరోసారి నిర్బంధంలో అచ్చెన్నాయుడు
మరోసారి నిర్బంధంలో అచ్చెన్నాయుడు సహా టీడీపీ మాజీమంత్రులూ, ఎమ్మెల్యేలు. చంద్రబాబు అరెస్ట్ పై గవర్నర్ ను కలవాలనే టీడీపీ ప్రతినిధుల ప్రయత్నంలో గందరగోళం పరిస్థితి నెలకొంది. రెండోసారి గవర్నర్ అపాయింట్ మెంట్ వాయిదా పడింది. సాయంత్రం లేదా రేపు మరోసారి కలవాలని టీడీపీ నేతల ఆలోచన.
-
10 Sep 2023 09:26 AM (IST)
టీడీపీ ప్రతినిధుల ప్రయత్నంలో గందరగోళం.. గవర్నర్ అపాయింట్ మెంట్ వాయిదా
చంద్రబాబు అరెస్ట్ పై గవర్నర్ ను కలవాలనే టీడీపీ ప్రతినిధుల ప్రయత్నంలో గందరగోళం పరిస్థితి నెలకొంది. రెండోసారి గవర్నర్ అపాయింట్ మెంట్ వాయిదా పడింది. సాయంత్రం లేదా రేపు మరోసారి కలవాలని టీడీపీ నేతల ఆలోచన. మరోసారి నిర్బంధంలో అచ్చెన్నాయుడు సహా టీడీపీ మాజీమంత్రులూ, ఎమ్మెల్యేలు.
-
10 Sep 2023 09:25 AM (IST)
చంద్రబాబు అరెస్ట్ పై టిడిపి ప్రతినిధులు గవర్నర్ కు ఫిర్యాదు
గవర్నర్ బస చేసిన హార్బర్ పార్క్ దగ్గర పోలీసులు మోహరింపు. మరికొద్దిసేపట్లో గవర్నర్ ను కలవనున్న టీడీపీ ప్రతినిధులు. అచ్చన్నాయుడు, అయ్యన్న, గంటా శ్రీనివాసరావు సహా 11మందితో కూడిన బృందం. చంద్రబాబు అరెస్ట్ అనంతరం పరిణామాలపై గవర్నర్ కు ఫిర్యాదు చేయాలని టీడీపీ నిర్ణయం. 9.45నిముషాలకు అపాయింట్ మెంట్ ఇచ్చిన గవర్నర్. అచ్చన్నాయుడు, అయ్యన్న కదలికలపై కొనసాగుతున్న పోలీసులు నిఘా.
-
10 Sep 2023 09:12 AM (IST)
నేను ఏ తప్పూ చేయలేదు- చంద్రబాబు
నేను ఏ తప్పూ చేయలేదు.. నాపై రాజకీయ కక్షతోనే కేసు నమోదు చేశారు… శనివారం ఉదయం 5.40కి సీఐడీ పోలీసులు నోటీసులు ఇచ్చారు.. ఈరోజు 5.40కి రిమాండ్ రిపోర్ట్ ఇచ్చారు.. వాదోపవాదాలు అయ్యేవరకు కోర్టులోనే ఉంటాను: చంద్రబాబు
-
10 Sep 2023 09:11 AM (IST)
న్యాయస్థానం తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ
న్యాయస్థానం తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ.. రిమాండ్ రిపోర్ట్‌ను కోర్టుకు సమర్పించిన సీఐడీ అధికారులు.. రిమాండ్ రిపోర్ట్‌లో నారా లోకేష్ పేరు.. చంద్రబాబు సన్నిహితుడు కిలారు రాజేష్ ద్వారా లోకేష్‌కు డబ్బులు అందినట్లు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్న సీఐడీ.. రిమాండ్ రిపోర్ట్‌లో బయటకొచ్చిన కీలక అంశాలు