Leading News Portal in Telugu

Somu Veerraju: చంద్రబాబు అరెస్ట్ ను ఖండించిన సోము వీర్రాజు


తూర్పు గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అరెస్టు సందర్భంగా సీఐడీ అధికారులు వ్యవహరించిన తీరును భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం గ్రామంలో నా భూమి నా దేశం కార్యక్రమంలో పాల్గొన్న సోము వీర్రాజు.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు వివరణ అడక్కుండా, ప్రొసీజర్ ఫాలో కాకుండా అరెస్ట్ చేయడం సమంజసం కాదు.. ఇది భారతీయ జనతా పార్టీ అభిప్రాయం అని ఆయన వెల్లడించారు.

చంద్రబాబు అరెస్టుకు ముందు నోటీసులు ఇవ్వకుండా, ఎఫ్ఐఆర్ల్ లో పేరు లేక పోయినప్పటికీ అరెస్ట్ చేయడం సరికాదు అంటూ సోము వీర్రాజు అన్నారు. అరెస్టు సందర్భంగా వ్యవహరించిన తీరును బీజేపీ ఖండిస్తుందన్నారు. పోలీసు శాఖ వాస్తవాలను గుర్తించాలి.. దానికి అనుగుణంగా వ్యవహరించాలి అనేది సాంప్రదాయం అని ఆయన తెలిపారు. జీ-20 దేశాల సమావేశంలో భారతదేశం ఒక కొత్త పద్ధతిని ఆవిష్కరిస్తుంది అని సోము వీర్రాజు తెలిపారు.

గతంలో జీ-20 దేశాల సమావేశం ఏ దేశంలో జరిగిన ఏదో ఒక ప్రదేశంలోనే జరిగేది కానీ భారతదేశంలో 60 ప్రాంతాల్లో 200 సమావేశాలు నిర్వహించే విధంగా ఏర్పాటు చేశారు అని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉన్న పేదరికంపై అవగాహన కలుగజేసేందుకు ఇది దోహదం చేస్తుంది అని సోము వీర్రాజు అన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానం పూర్తిగా తప్పు అని ఆయన విమర్శించారు. ప్రభుత్వానికి తొత్తులుగా పోలీసులు వ్యవహరించొద్దని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు అన్నారు.