Leading News Portal in Telugu

Justin Trudeau: కెనడా ప్రధాని విమానంలో సాంకేతిక సమస్య.. ఢిల్లీలోనే ట్రూడో!


Canada Prime Minister Justin Trudeau: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రయాణిస్తున్న విమానం ఢిల్లీ నుంచి బయల్దేరేందుకు ప్రయత్నిస్తుండగా సాంకేతిక సమస్య తలెత్తింది. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన జీ20 సమావేశానికి విచ్చేసిన జస్టిన్‌ ట్రూడో తిరిగి కెనడాకు బయల్దేరుతుండగా.. విమానంలో సాంకేతిక సమస్య తలెత్తినట్లు సమాచారం. విమానంలో సమస్య తలెత్తడంతో ఆయన తిరిగి ఢిల్లీలోనే ఉన్నారు.

జీ20 సమ్మిట్‌లో పాల్గొనేందుకు దేశ రాజధానికి వచ్చిన కెనడా ప్రతినిధి బృందం, గ్రౌండ్‌లోని ఇంజనీరింగ్ బృందం సమస్యను సరిదిద్దే వరకు భారతదేశంలోనే ఉంటుందని విమానాశ్రయ అధికారి ఒకరు తెలిపారు.