Leading News Portal in Telugu

Jailer: జైలర్ సక్సెస్.. కళానిధి ఎవ్వరినీ వదలలేదుగా..



Jailer

Jailer: సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా.. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జైలర్. సన్ పిక్చర్స్ బ్యానర్ లో కళానిధి మారన్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. ఆగస్టు 10 న రిలీజ్ అయిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా రికార్డ్ కలక్షన్స్ రాబట్టి రజినీ సత్తా చూపించింది. దాదాపు రూ. 600 కోట్లు రాబట్టి ఇండస్ట్రీని షేక్ చేసింది. ఇక ఈ సక్సెస్ ను సన్ పిక్చర్స్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తూ వచ్చింది. రజినీకాంత్ కు చెక్.. డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కు పోర్షే కారు.. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కు ఓకే పోర్షే కారు గిఫ్ట్ గా ఇచ్చిన విషయం తెల్సిందే. ఇక వీరికే కాకుండా జైలర్ సినిమాలో పనిచేసిన వారందరికీ కూడా కళానిధి మారన్ .. సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు.

Siggu: నేషనల్ అవార్డు డైరెక్టర్ కొత్త సినిమా.. ‘సిగ్గు’ మొదలు

తాజాగా జైలర్ సక్సెస్ సెలబ్రేషన్స్ పేరుతో చిత్ర బృందానికి మొత్తం.. గోల్డ్ కాయిన్స్ అందజేశాడు. అంతే కాకుండా టీమ్ మొత్తానికి భోజనాలు పెట్టి.. వారితో పాటు నెల్సన్, కళానిధి కలిసి భోజనం చేశారు. జైలర్ పేరుతో అందజేసిన ఆ గోల్డ్ కాయిన్స్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక దీంతో ప్రేక్షకులు .. కళానిధి మారన్ ను అభినందిస్తున్నారు. ఒక సినిమా మంచిగా రావాలంటే.. టీమ్ వర్క్ ఎంతో ముఖ్యం. అందుకోసం పనిచేసిన వారందరి వర్క్ ను అభినందిస్తూ గోల్డ్ కాయిన్ మాత్రమే ఇవ్వకుండా వారితో పాటు కూర్చొని భోజనం చేయడం ఎంతో మంచి విషయం అని, ఎవ్వరిని వదలకుండా.. అందరికి సక్సెస్ ను అందించాడని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.