*ఏపీలో చంద్రబాబు అరెస్టుకు నిరసనగా బంద్‌కు పిలుపునిచ్చిన టీడీపీ, మద్దతు తెలిపిన జనసేన
*ఏపీవ్యాప్తంగా 144 సెక్షన్ అమలు.. నేడు హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్న చంద్రబాబు లాయర్లు
*ఇవాళ,రేపు విశాఖ వేదికగా జైళ్ల శాఖ జాతీయ సదస్సు.. బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్,ఏపీ జైళ్లశాఖ సంయుక్త నిర్వహణ.. జాతీయ సదస్సును ప్రారంభించనున్న గవర్నర్ అబ్దుల్ నజీర్.. ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా
*నేడు శ్రీశైలంలో శ్రీస్వామి అమ్మవార్లకు ఆలయంలో సహస్ర దీపాలంకరణ, వెండి రదోత్సవం
*నేడు చైర్మన్ అధ్యక్షతన అన్నవరం దేవస్థానం పాలకమండలి సమావేశం
*నేడు సుప్రీం కోర్టులో గద్వాల్ ఎమ్మెల్యే కేసు.. తెలంగాణ హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చేసిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి.. గద్వాల్ ఎమ్మెల్యేగా డీకే అరుణ అంటూ తీర్పు ఇచ్చిన హైకోర్టు.. హైకోర్టు తీర్పుతో డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం
*నేడు సంగారెడ్డి జిల్లాలో సీపీఎం రైతాంగ పోరాట వార్షికోత్సవ సభ.. సభకి హాజరుకానున్న సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు
*నేడు సంగారెడ్డి జిల్లాలో బీజేపీ బహిరంగ సభ.. బహిరంగ సభలో పాల్గొననున్న కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల, ఎన్నికల నిర్వహణ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్.. బహిరంగ సభలో బీజేపీలో చేరనున్న సంగారెడ్డి బీఆర్‌ఎస్ నేత పులిమామిడి రాజు
*నేడు భద్రాచలం రామాలయంలో శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీకృష్ణ కళ్యాణం
*నేడు ప్రధాని మోడీతో భేటీ కానున్న సౌదీ అరేబియా ప్రిన్స్
*నేడు భారత్-పాక్ జట్ల మధ్య మ్యాచ్.. ఆదివారం వర్షం వల్ల రిజర్వ్ డేకు వాయిదా పడిన మ్యాచ్