Leading News Portal in Telugu

India vs Pakistan: జస్ప్రీత్ బుమ్రాకు సర్‌ప్రైజ్‌ గిప్ట్ ఇచ్చిన పాక్ పేసర్.. వీడియో వైరల్!


Shaheen Afridi gave Jasprit Bumrah a gift in Colombo on India vs Pakistan Match: భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు పాకిస్థాన్ యువ పేస్ బౌలర్ షాహీన్ షా అఫ్రిది సర్‌ప్రైజ్‌ గిప్ట్ ఇచ్చాడు. ఇటీవల తండ్రైన బుమ్రాకు అఫ్రిది గిప్ట్ ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశాడు. బాబు క్షేమ సమాచారం అడిగిన అనంతరం ఒకరినొకరు కౌగలించుకుని వెళ్లిపోయారు. ఆసియా కప్‌ 2023లో భాగంగా ఆదివారం భారత్‌, పాకిస్థాన్‌ మధ్య సూపర్‌-4 మ్యాచ్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

జస్ప్రీత్ బుమ్రా, షాహీన్ షా అఫ్రిదిలకు సంబంధించిన వీడియోను పాకిస్థాన్‌ క్రికెట్ బోర్డు (పీసీబీ) కూడా తన ఎక్స్‌లో పంచుకుంది. ఈ వీడియోపై ఫాన్స్ రియాక్ట్ అవుతున్నారు. మైదానంలో మాత్రమే పోటీతత్వం ఉండాలని, బయట సోదరభావంతో మెలగాలని కామెంట్లు చేశారు. బుమ్రా భార్య సంజనా గణేశన్‌ గత వరం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ప్రసవ సమయంలో బుమ్రా తన భార్య పక్కన ఉండేందుకు శ్రీలంక నుంచి ముంబై వచ్చాడు. నేపాల్‌తో మ్యాచ్‌కు దూరమైన బుమ్రా.. పాకిస్థాన్‌తో సూపర్‌-4కు మ్యాచ్‌కు ముందు అందుబాటులోకి వచ్చాడు.

ముందుగా ఊహించినట్టే ఆదివారం భారత్, పాకిస్థాన్‌ సూపర్‌-4 మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. దాంతో రిజర్వ్‌ డే (సెప్టెంబరు 11)కు మ్యాచ్ వాయిదా పడింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్.. 24.1 ఓవర్లకు 2 వికెట్ల నష్టానికి 147 రన్స్ చేసింది. ఈ సమయంలో భారీ వర్షం కురవడంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు. అనంతరం వర్షం తగ్గడంతో.. మైదానం సిద్ధం చేస్తుండగా మరోసారి వర్షం వచ్చింది. వర్షం ఇంతకీ తగ్గకపోవడంతో రిజర్వ్‌ డేకు వాయిదా వేశారు. సోమవారం భారత్ ఇన్నింగ్స్ 24.1 ఓవర్ల నుంచే ప్రారంభమవుతుంది.