Leading News Portal in Telugu

Lift Collapse: కుప్పకూలిన లిప్ట్ .. ఏడుగురు కూలీలు మృతి


మహారాష్ట్రలోని థానే నగరంలోని బల్కమ్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఓ బిల్డింగ్ లిఫ్ట్ కుప్ప కూలిపోవడంతో ఏడుగురు కార్మికులు దుర్మరణం చెందారు. ఈ ఘటనలో ఓ కార్మికుడు గాయపడి థానే ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే థానే మున్సిపల్ కార్పొరేషన్ బృందం, పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. దీంతో ఈ ఘటన థానే జిల్లాలో సంచలనం రేపుతుంది. ప్రమాదంలో గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.

వివరాల్లోకి వెళితే.. థానేలో రన్వాల్ పేరుతో కొత్తగా నిర్మించిన ఈ 40-అంతస్తుల బిల్డింగ్ లో పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. ఈ బహుళ అంతస్తుల భవనం పైకప్పుపై వాటర్ ప్రూఫింగ్ వర్క్ కూడా జరుగుతుంది. ఈ భవనంలో పని చేస్తున్న కార్మికులందరు తమ పనులు ముగించుకుని కిందకు వస్తున్నా.. క్రమంలో లిఫ్ట్ చప్పుడుతో కింద పడిపోయింది. ఒక్కసారిగా లిఫ్ట్ క్రింద పడటంతో అక్కడికక్కడే తోపులాట జరిగింది. దీంతో ఈ ప్రమాదంలో ఏడుగురు కూలీలు మరణించారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో మృతులంతా కూలీలే. ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉంది.