Leading News Portal in Telugu

Gold Smuggling: బెల్టు బంగారం.. బయటపడిన బండారం..


ఆదమరిస్తే అరక్షణంలో దేశాన్నే అమ్మేసేలా ఉన్నారు కేటుగాళ్లు.. బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తూ దొరికిన కాడికి దొచుకుంటున్నారు కొందరు.. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్న అక్రమ రవాణాని అరికట్టలేకపోతున్నారు.. కస్టమ్స్ అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్న.. దొరికిన వాళ్లకి శిక్షలు కఠినంగా వేస్తున్న వాళ్ళ పంథా మాత్రం మార్చుకోవడంలేదు.. బంగారాన్ని అక్రమంగా రవాణా చేసేందుకు అనేక కొత్త మార్గాలను అనుసరిస్తున్నారు.. స్మగ్లర్స్ ఎంత తెలివిగా బంగారాన్ని బార్డర్ దాటించాలని ప్రయత్నించినా వాళ్ళ ఆటలు సాగనివ్వట్లేదు కస్టమ్స్ అధికారులు.. గోల్డ్ స్మగ్లర్స్ ని చాకచక్యంగా పట్టుకుంటున్నారు.. బంగారం పట్టివేత కేసుల్ని గతంలో ఎన్నో చూసాము.. అయితే, తాజాగా బెంగుళూరులో బంగారం దొంగ రవాణా కేసు వెలుగులోకి వచ్చింది.

వివరాలలోకి వెళ్తే.. బెంగుళూరులో ఇద్దరు దుబాయ్ ప్రయాణీకులు బంగారాన్ని అక్రమంగా రవాణా చేసేందుకు సినిమా స్టైల్ లో ప్లాన్ చేశారు. బంగారాన్ని పేస్ట్ గా మార్చి దాంతో బెల్టు తయారు చేశారు. ఆ బంగారపు బెల్టుని అక్రంగా రవాణా చెయ్యడానికి ప్రయత్నించగా బెంగుళూరు విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన పై అధికారులు మాట్లాడుతూ.. దుబాయి నుంచి ఇండియాకి వస్తున్న ఇద్దరు ప్రయాణికులు బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడ్డారని.. వాళ్ళని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని.. అలాగే వాళ్ళ దగ్గర నుంచి 3 కేజీల గోల్డ్ ను కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. అయితే, స్వాధీనం చేసుకున్న బంగారం విలువ సుమారు రూ. 1.58 కోట్ల విలువ ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. ఇలా స్మగ్లర్స్ కస్టమ్స్ అధికారులకి పట్టుబడడం కొత్తేమీ కాదు.. ఎన్నిసార్లు పట్టుబడిన స్మగ్లర్స్ కి చీమకుట్టినట్లు కూడాలేదు.. పదే పదే స్మగ్లింగ్ కి పాల్పడుతున్నారు..