జీసన్ ను ఎంతగానో నమ్మే క్రైస్తవులు ఇతర మతాల దేవుళ్లను నమ్మడం అసాధ్యం. విగ్రహారాధన తప్పు అని వారు భావిస్తారు.. అలాంటి ఓ క్రైస్తవుడు అయ్యప్ప మాల ధరించాడు. త్వరలోనే శబరిమలలో కొలువైన అయ్యప్పను ఆయన సందర్శించుకోనున్నారు. 50 ఏళ్ల మనోనోజ్ ప్రసిద్ధ అనే ఫాదర్.. శబరిమల క్షేత్ర సందర్శన కోసం రెవరెండ్ లైసెన్స్ ను కూడా ఆయన వదులుకున్నారు. కేరళలోని తిరువనంతపురానికి చెందిన రెవరెండ్ మనోజ్ కేజీ అనే వ్యక్తి ఆంగ్లికన్ చర్చి ఆఫ్ ఇండియాలో ఫాదర్గా పని చేస్తున్నారు.
మనోజ్ కేజీకి ఇతర మతాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి. అందులో భాగంగానే ఆయన అయ్యప్ప మాల వేసుకున్నాడు. శబరిమల వచ్చి స్వామిని దర్శించుకుంటానని ఆయన తెలిపారు. దీంతో మతపరమైన నియమాలు ఉల్లంఘించారని.. ఫాదర్ మనోజ్ పై ఆంగ్లియన్ చర్చి నిషేధం విధించింది. ఆయన రెవరెండ్ గుర్తింపు కార్డును క్యాన్సిల్ చేసి.. స్వాధీనం చేసుకుంది. అయ్యప్పను దర్శించుకునే భక్తులు మాల ధరించినట్లుగానే ఫాదర్ మనోజ్ కేజీ కడా మాల ధరించారు. దీక్ష పూర్తి అయ్యాక శబరిమల క్షేత్రాన్ని దర్శించుకుంటానని తెలిపారు. ఈ సెప్టెంబర్ 20న అయ్యప్పను దర్శించుకుంటానని మనోజ్ తెలిపారు.
అయితే, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఉద్యోగం చేసే మనోజ్ 2010లో ఆధ్యాత్మికతవైపుగా అడుగులు వేశాడు.. 2015లో ఉద్యోగం వదిలేసి పూర్తి స్థాయి ఆధ్యాత్మికవేత్తగా మారిపోయారు. అలా ఆయన 2022లో రెవరెండ్ స్థానాన్ని అందుకుని.. జీతం తీసుకోకుండా బోధనలు చేసేవారు. అప్పటి నుంచి క్రైస్తవ బోధనలు చేసేవారు. అయితే, మనోజ్ కు ఇతర మతాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తితో ఎన్నో పుస్తకాలు చదివేవారు. ఇక, క్రైస్తవ నియమాలను ఉల్లంఘించినందుకు తన బోధనల లైసెన్స్ ను ఆయన వదులుకున్నారు.