కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ ప్రస్తుతం నటిస్తున్న భారీ యాక్షన్ ఫిల్మ్ ‘లియో’. సెన్సేషనల్ డైరెక్టర్ లోకేషన్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సెవెన్ స్కీన్ స్టూడియో బ్యానర్ లో ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో దళపతి విజయ్ సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. దాదాపు 14 ఏళ్ల తర్వాత త్రిష విజయ్ సరసన నటిస్తుంది.అక్టోబర్ 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్,యాక్షన్ కింగ్ అర్జున్, దర్శకులు గౌతమ్ మీనన్ మరియు మిష్కిన్ మన్సూర్ అలీఖాన్ వంటి స్టార్ క్యాస్ట్ కీలక పాత్రలలో నటిస్తున్నారు.భారీ యాక్షన్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా . తమిళంతో పాటు తెలుగు, కన్నడ, హిందీ, మలయాళంలో ఎంతో గ్రాండ్ గా విడుదల కాబోతోంది.
లియో విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రస్తుతం ఈ మూవీ అప్డేట్స్ కోసం ఆడియెన్స్, ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో లియోకు సెన్సార్ బోర్డ్ నుంచి షాక్ తగిలింది. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ గా ‘నా రెడీ’ అనే సాంగ్ విడుదలై ట్రెండింగ్ గా నిలిచింది. అదేవిధంగా వివాదానికి కూడా దారి తీసింది. ఈ సాంగ్ లో విజయ్ పొగతాగడం అలాగే వివాదాస్పాద పదాలకు డాన్స్ చేయడం వంటి వాటిపై రాజేశ్వరి ప్రియ అనే మహిళ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.నా రెడీ పాటపై బీజీపీ ఆఫీస్ లో కూడా ఆమె కంప్లైంట్ చేసింది. ఈ విషయంపై సెన్సార్ సభ్యులూ తాజాగా స్పందించారు.. ఆ పాటలో ఉన్న అభ్యంతర సన్నివేశాలు, వివాదాస్పాద పదాలను సెన్సార్ బోర్డ్ కట్ చేసింది. ప్రస్తుతం వివాదాస్పాద పదాలను కట్ చేసిన చేసిన సాంగ్ నే ఆయా మ్యూజిక్ ప్లాట్ ఫామ్స్ లో విడుదల చేయడం జరిగింది.ఈ చిత్రానికి సంబంధించి రెండో సాంగ్ ను కూడా చిత్ర యూనిట్ సెప్టెంబర్ 19 న విడుదల చేయనుంది. మరి ఆ పాట ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.