Leading News Portal in Telugu

Punch Prasad: పంచ్ ప్రసాద్ ఆపరేషన్ సఫలం… థాంక్యూ సీఎం జగన్ అంటూ!


Punch Prasad Operation Sucessful: ఈ టీవీ ‘జబర్దస్త్’ కమెడియన్ పంచ్ ప్రసాద్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. జబర్దస్త్ మొదలైనప్పటి నుంచి కమెడియన్ గా చేస్తున్నా ఎందుకో తగిన గుర్తింపు అయితే దక్కలేదు. అయితే ఆయన రెండు కిడ్నీలు ఫెయిల్ కావడంతో ఆయన డయాలసిస్ చేయించుకుంటున్నారు. రెగ్యులర్‌గా డయాలసిస్‌ చేయించుకుంటున్నప్పటికీ ఆయన ఆరోగ్యంలో మాత్రం ఎన్నో ఇబ్బందులు పడుతూనే ఉన్నాడు. ఆరోగ్యం సరిగా లేకున్నా మిత్రుల సహాయంతో బుల్లితెర షోలలో కనిపిస్తూ ఆ వచ్చిన డబ్బులు వైద్యానికి ఉపయోగిస్తూ వస్తున్నాడు. ఖరీదైన వైద్యం కావడంతో తన సంపాదన సరిపోవడం లేక పంచ్ ప్రసాద్ చికిత్స కోసం విరాళాలు కూడా సోషల్ మీడియా వేదికగా అడిగారు. ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి రూ. 1 లక్ష ఆర్థిక సహాయం చేయగా పలువురు ఇతరులు కూడా సాయం చేశారు.

Sound Party: సౌండ్ పార్టీ గట్టిగానే సౌండ్ చేస్తోందే!

ఇక ఆ మధ్య పంచ్ ప్రసాద్ కి తన కిడ్నీ ఇచ్చేందుకు భార్య సిద్ధం కాగా వైద్యులు వద్దని సూచించారు. డోనర్ దొరికిన నేపథ్యంలో మీరు కిడ్నీ ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నా ట్రాన్స్ప్లాంటేషన్ లేట్ అయింది. ఇక ఎట్టకేలకు హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో పంచ్ ప్రసాద్ కి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిందని తెలుస్తోంది. ఇందుకు ఏపీ ప్రభుత్వం సహకారం అందించిందని ఆయన సొంత యూట్యూబ్ ఛానల్ లో వెల్లడించారు. పంచ్ ప్రసాద్ వైద్యానికి అయిన ఖర్చు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా విడుదల చేసినట్టు తెలుస్తోంది. ఇక మంత్రి రోజా పంచ్ ప్రసాద్ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో సానుకూలంగా స్పందించి సీఎంఆర్ఎఫ్ తరపున పంచ్ ప్రసాద్ కి వైద్యం అందించినట్టు తెలుస్తోంది. ఇక విజయవంతంగా ఆపరేషన్ జరగడంతో పంచ్ ప్రసాద్ సీఎం జగన్, మంత్రి రోజాలతో పాటు మిత్రులు, అభిమానులకు వీడియో ద్వారా ధన్యవాదాలు చెప్పుకొచ్చాడు.