Leading News Portal in Telugu

Himanta Biswa Sharma: గాంధీ కుటుంబం దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కృషి చేస్తుంది


Himanta Biswa Sharma: గౌహతిలో నిర్వహించిన బీజేపీ మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సమావేశంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గాంధీ కుటుంబం దేశాన్ని విచ్చిన్నం చేయడానికి శాయశక్తులా కృషి చేస్తుందని విమర్శించారు. గాంధీ కుటుంబం ‘సర్దార్ ఆఫ్ డూప్లికేట్’ , అసలు కుంభకోణాలు మొదలైందే గాంధీ అనే బిరుదుతోనని కీలక వ్యాఖ్యలు చేశారు.

అనంతరం హిమంత బిస్వా శర్మ మాట్లాడుతూ.. ఢిల్లీలో G20 సమావేశానికి సభ్యత్వం వహించి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని సంవత్సరాలు పరిపాలనలో ఉన్నా.. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయినా స్వతంత్ర వేడుకలు జరపలేదన్నారు. కానీ బీజేపీ ప్రభుత్వం 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకలను ఎంతో ఘనంగా జరిపారని తెలిపారు. ప్రతి ఒక్కరూ మనం భారతీయులమని దేశ రక్షణ మనభాద్యతని అందరూ కలిసిమెలిసి ఉండాలని సూచించారు. ఢిల్లీ డిక్లరేషన్ సంపాదించారు. ఇప్పుడు భారత్ విశ్వగురువుగా మారిందని.. మహిళలే దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారని.. నారీ శక్తి, మహిళా సాధికారతపై ప్రధాని మోడీ ఎక్కువ దృష్టి సారించారని వెల్లడించారు. భారత్‌ను విశ్వగురువుగా తీర్చిదిద్దేందుకు ప్రధాని మోడీ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. అభివృద్ధి పరివర్తన పరంగా ఈశాన్య రాష్ట్రాలు మారాయని సూచించారు. మరోవైపు ఏ హిందువు కూడా కూలతత్వాన్ని సమర్ధించడని.. తమిళనాడు మంత్రి హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడారని అస్సాం ముఖ్యమంత్రి మండిపడ్డారు.