మాస్ మహారాజ్ రవితేజ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వర రావు. రవితేజ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమాను దర్శకుడు వంశీ తెరకెక్కిస్తున్నారు.1970 కాలంలో స్టూవర్ట్‌పురంలో పాపులర్ దొంగగా పేరుపొందిన టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ నుపుర్ సనన్ రవితేజ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ఈ మూవీ భారీ బడ్జెట్ తో ఎంతో గ్రాండ్ గా నిర్మించారు.ఈ మూవీలో అనుపమ్ ఖేర్, మురళీశర్మ, రేణు దేశాయ్, గాయత్రీ భార్గవి వంటి వారు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమాకు శ్రీకాంత్ వీస్సా డైలాగ్స్ అందిస్తున్నారు.
అయితే గత కొద్ది రోజులుగా ఈ మూవీ రిలీజ్ విషయంలో వివాదం నెలకొంది.దీంతో మాస్ రాజా ఫ్యాన్స్ టైగర్ నాగేశ్వరావు రిలీజ్ డేట్ విషయంలో కాస్త సంధిగ్ధం లో వున్నారు.తాజాగా హీరో రవితేజ రిలీజ్ డేట్ పై క్లారిటీ ని ఇచ్చారు. తాను స్వయంగా నిర్మించి విడుదల చేస్తున్న చాంగురే బంగారు రాజా మూవీ ప్రీ రిలీజ్ కి రవితేజ అటెండ్ అయ్యారు. టైగర్ నాగేశ్వర రావు మూవీ ఫస్ట్ ఫిక్స్ అయిన అక్టోబర్ 20 కే థియేటర్స్ కి రానుందనే విషయాన్ని ఆయన వెల్లడించారు. ఈ మూవీ దసరా బరిలో నే ఉందని రవితేజ కన్ఫర్మ్ చేశారు. ఈ దసరా కానుక గా అక్టోబర్ 19న బాలయ్య నటించిన భగవంత్ కేసరి, విజయ్ దళపతి లియో మూవీస్ విడుదల అవుతుందటంతో ఈ సారి గట్టి పోటీ నెలకొంది. ఈ పోటీలో రవితేజ మూవీ కూడా జాయిన్ అవుతుందడంతో రవితేజ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.అయితే ఈ మూవీ రిలీజ్ ను ఆపాలంటూ..స్టువర్ట్ పురం గ్రామస్థులు నిరసనలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో సినిమా రిలీజ్ అయ్యే వరకు ఏం జరుగుతుందో మరి చూడాలి.